Share News

Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. టీ20 క్రికెట్‌లో ఆల్‌టైమ్ రికార్డ్

ABN , Publish Date - Dec 05 , 2024 | 02:48 PM

Abhishek Sharma: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. తనలోని పించ్ హిట్టర్‌ను మళ్లీ నిద్రలేపిన ఈ పంజాబీ పుత్తర్.. ఏకంగా ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.

Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. టీ20 క్రికెట్‌లో ఆల్‌టైమ్ రికార్డ్

SMAT 2024: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు దిగుతున్నాడంటేనే ప్రత్యర్థులు భయపడతారు. బౌండరీలు, సిక్సులతో ఎక్కడ తమపై విరుచుకుపడతాడోనని వణికిపోతారు. అభిషేక్ బ్యాట్ గర్జిస్తే అలా ఉంటుంది. అందుకే అతడ్ని సాధ్యమైనంత త్వరగా ఔట్ చేయాలని అపోజిషన్ టీమ్స్ ప్లాన్ చేస్తుంటాయి. ఒకవేళ క్రీజులో నిలబడ్డాడా వాళ్ల పని ఫినిష్. ఇది మరోమారు ప్రూవ్ అయింది. ఈ స్టార్ ఓపెనర్ ఇంకోసారి విధ్వంసం సృష్టించాడు. తనలోని పించ్ హిట్టర్‌ను మళ్లీ నిద్రలేపిన ఈ పంజాబీ పుత్తర్.. ఏకంగా ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్‌తో రికార్డుల బూజు దులిపాడు.


ఉర్విల్ సరసన అభిషేక్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ విశ్వరూపం చూపించాడు. తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లను అతడు ఊచకోత కోశాడు. ఆ బౌలర్, ఈ బౌలర్ అని తేడాల్లేకుండా అందర్నీ పిచ్చకొట్టుడు కొట్టాడు. బౌండరీలు, సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు అభిషేక్. మొత్తంగా 29 బంతుల్లో 106 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారత ప్లేయర్‌గా ఉర్విల్ పటేల్ పేరిట ఉన్న రికార్డును అతడు సమం చేశాడు.


ఇదేం స్ట్రైక్ రేట్‌

ఇదే టోర్నీలో త్రిపుర జట్టుతో నవంబర్ 27న జరిగిన మ్యాచ్‌లో ఉర్విల్ పటేల్ ఫాస్టెస్ట్ సెంచరీ బాదాడు. తాజా మ్యాచ్‌తో అతడి ఆల్‌టైమ్ రికార్డును అభిషేక్ సమం చేశాడు. మేఘాలయతో మ్యాచ్‌లో 8 బౌండరీలు కొట్టిన పంజాబీ పుత్తర్.. ఏకంగా 11 సిక్సులు బాదేశాడు. 365 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేశాడు. అతడి దెబ్బకు టార్గెట్ 142ను 9.3 ఓవర్లలోనే ఛేజ్ చేసేసింది పంజాబ్. ఇన్నింగ్స్ ఆసాంతం బౌలర్లను ఉతికి ఆరేశాడు అభిషేక్. ముఖ్యంగా హేమంత్ ఫుకన్, రిబోక్లాంగ్‌ను లక్ష్యంగా చేసుకొని భారీ షాట్లు బాదాడు. కెప్టెన్ ఆకాశ్ చౌదరీని కూడా వదల్లేదు అభిషేక్.


Also Read:

అమ్మాయిలు ఫెయిల్.. బెండు తీస్తారనుకుంటే భయపడ్డారు

ఆస్ట్రేలియాతో సెకండ్ టెస్ట్.. రెండు కీలక మార్పులతో బరిలోకి భారత్

13 ఏళ్లకే కోటీశ్వరుడైన వైభవ్ విధ్వంసం.. 76 పరుగులతో అజేయంగా..

నాలుగు గంటలు సాగినా.. ఫలితం తేలలేదు

For More Sports And Telugu News

Updated Date - Dec 05 , 2024 | 02:52 PM