Allah Ghazanfar: ఆఫ్ఘాన్ నుంచి మరో డేంజర్ స్పిన్నర్.. ఎవరీ అల్లా ఘజన్‌ఫర్?
ABN , Publish Date - Nov 07 , 2024 | 03:33 PM
Allah Ghazanfar: ఆఫ్ఘానిస్థాన్ జట్టు నుంచి మరో డేంజర్ స్పిన్నర్ వచ్చాడు. నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను వణికించాడు. అతడి జోరు చూస్తుంటే స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను మించిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
AFG vs BAN: ప్రపంచ క్రికెట్‌లో ఆఫ్ఘానిస్థాన్ జట్టు మిగతా టీమ్స్ కంటే కాస్త స్పెషల్ అనే చెప్పాలి. తక్కువ సమయంలో టాప్ జట్లను వణికించే స్థాయికి ఎదిగింది ఆఫ్ఘాన్. స్పిన్ బలంతో బడా బడా టీమ్స్‌ను కూడా చిత్తు చేస్తూ షార్ట్ టైమ్‌లోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, ముజీబుర్ రెహ్మాన్, నూర్ అహ్మద్ లాంటి ఒకర్ని మించిన మరో స్పిన్నర్ ఆ జట్టులో ఉన్నాడు. అలాంటి లైనప్‌లోకి ఇప్పుడు మరో డేంజర్ స్పిన్నర్ వచ్చి చేరాడు. వరల్డ్ క్రికెట్‌లో కొత్త హీరో వచ్చాడు. ఇంతకీ ఎవరా స్పిన్నర్ అనేది ఇప్పుడు చూద్దాం..
నడ్డి విరిచాడు
ఆఫ్ఘానిస్థాన్ నయా స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. బంగ్లాదేశ్‌తో షార్జా స్టేడియంలో నిన్న జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ 92 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హజ్మతుల్లా సేన 49.4 ఓవర్లలో 235 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన బంగ్లా 34.3 ఓవర్లలో 143 పరుగులకు కుప్పకూలింది. కొత్త స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ 6 వికెట్లతో చెలరేగాడు. ప్రత్యర్థి జట్టుకు ఎక్కడా బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఇవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీస్తూ వెన్ను విరిచాడు.
ఫ్యూచర్ స్టార్
తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, మెహ్దీ హసన్, ముష్ఫికర్ రహీం లాంటి క్వాలిటీ, ఎక్స్‌పీరియెన్స్ కలిగిన బ్యాటర్లను ఘజన్‌ఫర్ తన మిస్టరీ స్పిన్‌తో ముప్పుతిప్పలు పెట్టాడు. ఆఫ్ స్పిన్‌తో పాటు దూస్రాలు కూడా వేస్తూ అపోజిషన్ టీమ్ ప్లేయర్లతో ఆడుకున్నాడు. అతడి బౌలింగ్ చూస్తుంటే ఎంతో అనుభవం కలిగిన బౌలర్‌లా అనిపించాడు. బౌలింగ్‌లో ఉన్న వేరియేషన్స్, లెంగ్త్‌లో మార్పులు, బ్యాటర్లకు తగ్గట్లు లైన్ మార్చుకోవడం హైలైట్‌గా నిలిచింది.
బ్యాగ్రౌండ్ ఇదే..
ఒక్క పెర్ఫార్మెన్స్‌తో హీరో అయిపోయాడు 18 ఏళ్ల అల్లా ఘజన్‌ఫర్. దీంతో అతడి గురించి తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. ఆఫ్ఘాన్‌లోని పాకితా ప్రాంతానికి చెందిన ఈ మిస్టరీ స్పిన్నర్ మార్చి 20, 2006లో జన్మించాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఎంపికైన ఈ కుర్రాడు.. టీమ్ అబుదాబి, మిస్ ఐనక్ నైట్స్, కొలంబో స్ట్రైకర్స్ లాంటి ఇతర జట్లకు కూడా ఆడాడు. వచ్చే కొన్నేళ్లలో టీ20 క్రికెట్‌లో అతడు సెన్సేషన్‌గా మారడం ఖాయమని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఘజన్‌ఫర్ బౌలింగ్‌ను సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా మెచ్చుకుంటున్నారు. రషీద్ ఖాన్‌కు వారసుడిగా కనిపిస్తున్నాడని ప్రశంసిస్తున్నారు. ఒక్క మెతుకు చూసి అన్నం ఉడికిందో లేదో చెప్పేయొచ్చని.. అలాగే ఇతడి ఒక్క స్పెల్ చూసి పక్కా ఫ్యూచర్ స్టార్ అవడం ఖాయమని ప్రెడిక్ట్ చేస్తున్నారు. మరి.. ఘజన్‌ఫర్ ఏ లెవల్‌లో ప్రపంచ క్రికెట్‌పై తన ముద్ర వేస్తాడో చూడాలి.
Also Read:
వేలానికి స్టోక్స్ దూరం
రాజభోగాలు వీడండి.. రంజీలు ఆడండి
ఆస్ట్రేలియా పర్యటనకు ముందు చెడు సంకేతాలు.. ఇలా తయారయ్యారేంటి
For More Sports And Telugu News