Share News

IND vs AUS: పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే..

ABN , Publish Date - Dec 08 , 2024 | 01:58 PM

IND vs AUS: అనుకున్నదే అయింది. కంగారూల చేతిలో భంగపాటు తప్పలేదు. మొదటి టెస్టు గెలుపు సంబురాలు ముగిసేలోపే రెండో టెస్టులో ఘోర పరాభవం పాలైంది టీమిండియా. ఈ ఓటమిని ఆటగాళ్లే కాదు.. అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు.

IND vs AUS: పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే..

అనుకున్నదే అయింది. కంగారూల చేతిలో భంగపాటు తప్పలేదు. మొదటి టెస్టు గెలుపు సంబురాలు ముగిసేలోపే రెండో టెస్టులో ఘోర పరాభవం పాలైంది టీమిండియా. ఈ ఓటమిని ఆటగాళ్లే కాదు.. అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు. భారీ విజయం సాధించి సిరీస్‌లో మరింత ముందుకు వెళ్తారని అనుకుంటే.. 10 వికెట్ల భారీ తేడాతో ఓడిపోవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. బౌలింగ్ దగ్గర నుంచి బ్యాటింగ్, ఫీల్డింగ్ వరకు అన్నింటా మెన్ ఇన్ బ్లూ దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఈ నేపథ్యంలో అసలు పింక్ బాల్ టెస్ట్‌లో భారత్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..


నిలకడ లేని బ్యాటింగ్

రెండో టెస్ట్‌లో టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా బ్యాటింగ్ ఫెయిల్యూర్‌ను చెప్పాలి. తొలి ఇన్నింగ్స్‌లో టాప్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. గంపెడాశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 3 రన్స్ చేసి క్రీజును వీడాడు. రిషబ్ పంత్ (21), శుబ్‌మన్ గిల్ (31), కేఎల్ రాహుల్ (37) మంచి స్టార్ట్ లభించినా సద్వినియోగం చేసుకోలేదు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఇదే తీరు. రాహుల్, రోహిత్ డబుల్ డిజిట్ టచ్ చేయలేదు. ఇదే మ్యాచ్ రిజల్ట్‌ను డిసైడ్ చేసింది.


సెలెక్షన్ లోపాలు

పెర్త్ టెస్ట్‌లో అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు యంగ్ స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్. అయితే అతడ్ని అడిలైడ్‌లో ఆడించలేదు. అతడి స్థానం జట్టులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ కేవలం 1 వికెట్ మాత్రమే తీశాడు. బ్యాటింగ్‌లోనూ అతడు కాంట్రిబ్యూట్ చేయలేదు. ఇది టీమ్‌కు మైనస్‌గా మారింది.


బౌన్సర్ల బలహీనత

షార్ట్ బాల్స్ ఆడటంలో భారత బ్యాటర్లు ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే వస్తున్నారు. అయితే పెర్త్ టెస్ట్‌లో ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. కానీ అడిలైడ్‌లో పింక్ బాల్ అనూహ్యంగా బౌన్స్ అవడంతో ఏం చేయాలో వారికి పాలుపోలేదు. దీంతో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ షార్ట్ బాల్ వ్యూహంతో భారత బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. రిషబ్ పంత్‌తో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఈ బంతుల్ని ఎదుర్కోవడంలో స్ట్రగుల్ అయ్యారు.


ఆసీస్ డామినేషన్

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలింగ్ డామినేషన్ నడిచింది. హోమ్ కండీషన్స్, అలవాటు పడిన వాతావరణం, అడిలైడ్ పిచ్‌పై అవగాహన, పింక్ బాల్‌తో ఆడిన అనుభవాన్ని ఆ జట్టు పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. కమిన్స్‌, స్టార్క్‌తో పాటు కొత్త పేసర్ బోలాండ్ అద్వితీయంగా బౌలింగ్ చేశారు. బౌన్సర్లు, స్వింగ్ డెలివరీస్‌తో టీమిండియా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సూపర్బ్‌ బౌలింగ్‌తో భారత్‌ను కోలుకోకుండా చేశారు. మ్యాచ్‌లో రిజల్ట్‌ను శాసించారు. కంగారూలతో పోలిస్తే భారత బౌలింగ్ అటాక్ చాలా బలహీనంగా కనిపించింది.


పార్ట్‌నర్‌షిప్స్

పింక్ బాల్ టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కొందరు భారత బ్యాటర్లకు మంచి స్టార్ట్ లభించింది. అయితే వాటిని బిగ్ స్కోర్స్‌గా మలచలేకపోయారు. అదే సమయంలో ఇతరులతో కలసి భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయారు. అందుకే భారీ స్కోరు చేయలేక చతికిలపడింది భారత్. ఓపెనర్లు సరైన స్టార్ట్ ఇవ్వకపోవడం, టాపార్డర్ పార్ట్‌నర్‌షిప్స్ బిల్డ్ చేయకపోవడంతో మిడిలార్డర్ మీద ఒత్తిడి పెరిగింది.


Also Read:
అదే టీమిండియా కొంపముంచిందా.. ఆసిస్‌తో ఓటమికి 3 కారణాలు

నిలువునా ముంచిన బ్యాటర్లు.. భారత్ ఘోర పరాజయం

నూటికో ‘కోటి’కో ఒక్కడు...
For More
Sports And Telugu News

Updated Date - Dec 08 , 2024 | 02:09 PM