Share News

India vs Afghanistan: విధ్వంసం సృష్టించిన రోహిత్, రింకూ.. హిస్టరీ క్రియేట్ చేసిన కెప్టెన్

ABN , Publish Date - Jan 17 , 2024 | 09:01 PM

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (121 నాటౌట్) శతక్కొట్టడం, రింకూ సింగ్ (69 నాటౌట్) అర్థశతకంతో ఊచకోత కోయడం వల్లే భారత్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది.

India vs Afghanistan: విధ్వంసం సృష్టించిన రోహిత్, రింకూ.. హిస్టరీ క్రియేట్ చేసిన కెప్టెన్

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (121 నాటౌట్) శతక్కొట్టడం, రింకూ సింగ్ (69 నాటౌట్) అర్థశతకంతో ఊచకోత కోయడం వల్లే భారత్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. నిజానికి.. భారత జట్టు మొదట్లో 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడం, అందునా విరాట్ కోహ్లీతో పాటు సంజూ శాంసన్ డకౌట్లుగా వెనుదిరగడంతో.. భారత జట్టు 120 పరుగుల మైలురాయిని దాటడం కూడా కష్టమేనని అనుకున్నారు. అంతకన్నా తక్కువ స్కోరుకే చాపచుట్టేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంచనా వేశారు.


కానీ.. ఆ అంచనాలని బోల్తా కొట్టిస్తూ రోహిత్, రింకూ మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. తొలుత క్రీజులో కుదుర్కోవడానికి కొంత సమయం తీసుకున్న వీళ్లిద్దరు.. ఆ తర్వాతి నుంచి చెలరేగిపోయారు. తొలుత రోహిత్ శర్మ తన ఖాతా తెరిచాడు. ఎడాపెడా షాట్లతో ఆఫ్ఘన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చూస్తుండగానే అతడు అర్ద శతకం చేసేశాడు. అనంతరం రింకూ సింగ్ కూడా పుంజుకొని.. భారీ షాట్లు బాదడం మొదలుపెట్టాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన వీళ్లిద్దరూ.. జట్టుని ఆదుకునే బాధ్యతని భుజాలపై వేసుకొని.. భారీ స్కోరుని అందించారు. చివరివరకూ క్రీజులోనే నిల్చొని.. ఆకాశమే హద్దుగా దుమ్ముదులిపేశారు. ఈ క్రమంలో రోహిత్ సెంచరీ, రింకూ హాఫ్ సెంచరీ చేసుకున్నారు. ఐదో వికెట్‌కి ఏకంగా 190 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.

ఈ సెంచరీతో కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట ఒక వరల్డ్ రికార్డ్‌ని లిఖించుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రపుటలకెక్కాడు. అంతేకాదు.. టీ20ల్లో అతనికి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయ్యి నిరాశపరిచినా రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో సెంచరీ కొట్టి, ఆ ఆకలిని తీర్చుకున్నాడు. ఏ రికార్డులైనా తాను దిగనంత వరకేనని ఈ ఇన్నింగ్స్‌తో కెప్టెన్ రోహిత్ చాటిచెప్పాడు. కాకపోతే.. విరాట్ కోహ్లీ డకౌట్ అవ్వడమే ఈ మ్యాచ్‌లో నిరాశపరిచే విషయం.

Updated Date - Jan 17 , 2024 | 09:08 PM