Share News

Yashasvi Jaiswal: పెర్త్ టెస్ట్‌లో ఊహించని సీన్.. ఈ సెల్యూట్‌కు అర్థం తెలుసా?

ABN , Publish Date - Nov 23 , 2024 | 09:34 PM

Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగిపోయాడు. పెర్త్ టెస్ట్‌లో సూపర్బ్ బ్యాటింగ్‌తో కంగాకూలకు ఎర్త్ పెట్టాడు. అయితే ఆఖర్లో అతడు సెల్యూట్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Yashasvi Jaiswal: పెర్త్ టెస్ట్‌లో ఊహించని సీన్.. ఈ సెల్యూట్‌కు అర్థం తెలుసా?

పెర్త్: సొంతగడ్డపై ఆడుతున్నాం, బాగా అలవాటైన పిచ్‌లు మనల్ని ఎవరు ఓడిస్తారులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్న ఆస్ట్రేలియాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టీమిండియా దెబ్బకు కంగారూలకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. పెర్త్ టెస్ట్‌లో తొలుత బుమ్రా అండ్ కో సూపర్బ్ బౌలింగ్‌తో ఆ టీమ్‌కు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్-కేఎల్ రాహుల్ నమ్మశక్యం కాని బ్యాటింగ్‌తో ఆసీస్‌ను మరింత వణికించారు. ముఖ్యంగా యంగ్ ఓపెనర్ జైస్వాల్ ఆ జట్టు బౌలర్లను ఆటాడుకున్నాడు. అయితే ఆఖర్లో ఓ ఊహించని సంఘటన జరిగింది.


సెల్యూట్ అతడికే..

తొలి టెస్ట్ రెండో రోజు ఆట ముగిశాక అటు ఆసీస్ ఆటగాళ్లు, ఇటు భారత ఓపెనర్లు జైస్వాల్-రాహుల్ పెవిలియన్ బాట పట్టారు. ఎవరి డ్రెస్సింగ్ రూమ్ దిశగా వాళ్లు వెళ్లసాగారు. ఈ తరుణంలో అనూహ్యంగా జైస్వాల్ సెల్యూట్ చేస్తూ కనిపించాడు. దీంతో ఈ సెల్యూట్‌కు అర్థం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. వెనుక నుంచి జట్టును నడిపిస్తున్న కోచ్ గంభీర్ లేదా తమను ఎంకరేజ్ చేస్తున్న ఆడియెన్స్‌కు సెల్యూట్ చేసి ఉంటాడని కొందరు అనుకున్నారు. అయితే వాస్తవానికి జైస్వాల్ సెల్యూట్ చేసింది మరెవరికో కాదు.. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి.


కోహ్లీకి గౌరవంగా..

రెండో రోజు ఆట ముగిశాక గ్రౌండ్‌లోకి వచ్చాడు కోహ్లీ. కాళ్లకు ప్యాడ్స్ కట్టుకొని, చేతిలో బ్యాట్‌ పట్టుకొని వచ్చిన కింగ్.. జైస్వాల్-రాహుల్ జోడీని మెచ్చుకున్నాడు. చేతితో బ్యాట్‌ను కొడుతూ అభినందించాడు. దీంతో అటు నుంచి జైస్వాల్‌ గౌరవపూర్వకంగా సెల్యూట్ చేశాడు. కాగా, రెండో రోజు ముగిసేసరికి సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్లేమీ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. జైస్వాల్ (90 నాటౌట్), రాహుల్ (62 నాటౌట్) క్రీజులో ఉన్నారు. టీమ్ లీడ్ 218 పరుగులకు చేరుకుంది. మూడో రోజు భారత్ ఎంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేస్తే ఆధిక్యం అంత పెరుగుతుంది. 350 రన్స్‌ను టార్గెట్‌గా పెడితే జట్టుకు ఢోకా ఉండదు. అయితే పిచ్ ఎలా ప్రవర్తిస్తుందనే దాని మీదే లక్ష్యం ఎంత వరకు సెట్ చేస్తారనేది ఆధారపడి ఉంది.


Also Read:

ఊచకోతకు హార్దిక్ కొత్త డెఫినిషన్.. ఎవర్నీ వదలకుండా పిచ్చకొట్టుడు

ఆసీస్‌కు కొత్త మొగుడు.. కోహ్లీని మించిపోయాడుగా..

ఆసీస్‌తో ఆడుకున్న రాహుల్-జైస్వాల్.. ఏం ఆడారు భయ్యా

For More Sports And Telugu News

Updated Date - Nov 23 , 2024 | 10:06 PM