IND vs AUS: టాస్ గెలిచిన రోహిత్ సేన.. గెలుపెవరిదో తేలిపోయింది.. భారత్‌కు అదొక్కటే మైనస్
ABN , Publish Date - Dec 06 , 2024 | 10:15 AM
మొదటి టెస్ట్‌లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాను ఘోరంగా ఓడించి మరింత ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ కారణంగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. మరోవైపు పింక్ బాల్ తో భారత్ కు అనుభవం తక్కువ.. మరి గెలిచేదెవరో చూసేయండి..
ఆడిలైడ్: ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య 5-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30 గంటలకు అడిలైడ్ ఓవల్‌లో మ్యాచ్ ప్రారంభమైంది. రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో భారత జట్టు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.
టీమిండియాకు అదే మైనస్..
పింక్-బాల్ టెస్ట్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా గత రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటి వరకు 12 పింక్ బాల్ టెస్టులు ఆడింది. కాగా ఈ జట్టు 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. టీమ్ ఇండియా ఇప్పటివరకు గులాబీ బంతితో మొత్తం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. అందులో మాత్రమే గెలిచింది. దీంతో రెండో టెస్టు కూడా టీమిండియాకు కత్తిమీద సాములాగే మారింది.
ఆసిస్ ముందున్న అతిపెద్ద సవాలు..
తొలి మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించడంతో ఈ టెస్టు సిరీస్‌లో ఉత్కంఠ మరింత పెరిగింది. తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు ఈ పింక్-బాల్ టెస్ట్‌లో తన బ్యాటింగ్‌ను మెరుగుపరచుకోవడం ఆసిస్ ముందున్న అతిపెద్ద సవాలు. ఆస్ట్రేలియా టాప్ నలుగురు బ్యాట్స్‌మెన్లు 8 ఇన్నింగ్స్‌ల్లో 29 పరుగులు మాత్రమే చేయగలిగారు. ఈ ఏడాది ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ సగటు కూడా 30 కంటే తక్కువ. దీంతో పోలిస్తే బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లు మెరుగ్గా ఉన్నాయి.
భయపెడుతున్న బుమ్రా..
టీమ్ ఇండియా ఫేవరెట్ మైదానాల్లో అడిలైడ్ ఒకటి. ఈ పిచ్‌పై విరాట్ కోహ్లి సులువుగా పరుగులు చేస్తున్నాడు. ముఖ్యంగా బుమ్రా సారథ్యంలో టీమ్ ఇండియా బౌలింగ్ ఆస్ట్రేలియాకు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పింక్ బాల్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రా స్వింగ్ బౌలింగ్ అత్యంత ప్రమాదకరమైనది.
అడిలైడ్‌లో టీమిండియా
1948లో ఈ మైదానంలో టీం ఇండియా తన తొలి మ్యాచ్ ను ఆడింది. ఈ మైదానంలో టీమిండియా 13 మ్యాచ్‌లు ఆడగా మొత్తం 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 2 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది. 3 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఈ మైదానంలో టీమిండియా చేసిన అత్యధిక స్కోరు 2008లో 526 పరుగులు. ఈ మైదానంలో టీమిండియా తరఫున విరాట్ కోహ్లీ అత్యధికంగా 509 పరుగులు చేశాడు. కాగా, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ మైదానంలో అత్యధికంగా 19 వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ ప్రెడిక్షన్..
మొదటి టెస్ట్‌లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాను ఘోరంగా ఓడించి మరింత ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ కారణంగా పింక్ బాల్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. టీమ్ ఇండియా బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శన చూస్తుంటే ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియాకే గెలుపు అవకాశాలు ఎక్కువని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వారి మ్యాచ్ ప్రెడిక్షన్ ప్రకారం..
ఆస్ట్రేలియా గెలిచే చాన్సెస్: 45%
టీమ్ ఇండియా గెలిచే అవకాశం: 55%.