India vs South Africa: ఫైనల్ మ్యాచ్‌కి ముందు.. భారత్ షాకింగ్ నిర్ణయం
ABN , Publish Date - Jun 28 , 2024 | 10:01 PM
టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ని సొంతం చేసుకునేందుకు భారత జట్టు కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ఫైనల్ పోరులో సౌతాఫ్రికా జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతోంది. బార్బడోస్ వేదికగా..
టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) టైటిల్‌ని సొంతం చేసుకునేందుకు భారత జట్టు కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉంది. ఫైనల్ పోరులో సౌతాఫ్రికా (South Africa) జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతోంది. బార్బడోస్ వేదికగా.. శనివారం రాత్రి 8:00 గంటలకు జరగనున్న ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది, ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. 2013 తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీ ముద్దాడని భారత్.. ఆ సుదీర్ఘ నిరీక్షణకు చెక్ పెట్టాలని చూస్తోంది. అందుకోసం ధీటైన ప్రణాళికలనే సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగానే.. పైనల్ పోరుకి ముందు భారత జట్టు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా.. ప్రధాన మ్యాచ్‌లు ఆడటానికి ముందు ఏ జట్టైనా ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహిస్తుంది. ప్రధాన మ్యాచ్‌ల్లో ఆటగాళ్లందరూ సమర్థవంతంగా రాణించాలన్న ఉద్దేశంతోనే.. ఇలా ప్రాక్టీస్ చేస్తారు. అయితే.. టీమిండియా మేనేజ్‌మెంట్ మాత్రం వరల్డ్‌కప్‌కి ముందు ప్రాక్టీస్ సెషన్‌ని రద్దు చేసింది. తమ జట్టు ఆటగాళ్లు ఎలాంటి గాయాల బారిన పడకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సెమీ ఫైనల్‌కి, ఫైనల్ మ్యాచ్‌కి కేవలం ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉంది కాబట్టి.. ఆటగాళ్లకు గాయాలు తగిలితే వాటి నుంచి వెంటనే కోలుకోలేరు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే.. ప్రాక్టీస్ సెషన్స్‌ను క్యాన్సిల్ చేయడం జరిగింది.
కానీ.. సౌతాఫ్రికా జట్టు మాత్రం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంది. నెట్స్‌లో ఆటగాళ్లందరూ తీవ్రంగా శ్రమించారు. సెమీ ఫైనల్స్ ద్వారా వారికి కొంత ఎక్కువ సమయం దొరికింది కాబట్టి.. ప్రాక్టీస్ చేయడానికి వీలు దొరికింది. దీనికితోడు.. సౌతాఫ్రికా జట్టు చరిత్రలోనే తొలిసారి ఫైనల్స్‌కు చేరుకుంది. ఇంతవరకూ ఒక్క కప్ కూడా గెలవని ఆ జట్టు.. ఈసారి సమిష్టి కృషితో ఫైనల్స్‌కు చేరుకుంది. టైటిల్ నెగ్గేందుకు ఒక్క అడుగు దూరంలోనే ఉంది కాబట్టి.. ఎలాగైనా మ్యాచ్ గెలిచి, చరిత్ర సృష్టించాలని చూస్తోంది. మరి.. హోరాహోరీగా సాగనున్న ఈ పోరులో ఎవరు నెగ్గుతారో చూడాలి.
Read Latest Sports News and Telugu News