Gambhir-Nitish Reddy: గంభీర్ మాటలతో నెత్తురు మరిగింది.. అందుకే విరుచుకుపడ్డాం: నితీష్ రెడ్డి
ABN , Publish Date - Nov 22 , 2024 | 05:36 PM
Gambhir-Nitish Reddy: సొంతగడ్డపై పులుల్లాంటి ఆస్ట్రేలియాను టీమిండియా వణికిస్తోంది. భీకరమైన బౌలింగ్‌తో కంగారూ బ్యాటర్లను భయపెట్టిస్తోంది భారత్. అయితే చేజారుతున్న మ్యాచ్ ఒక్కసారిగా టర్న్ తీసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్ నుంచి కోచ్ గౌతం గంభీర్ పంపిన మెసేజ్ కారణమని తెలిసింది.
IND vs AUS: సొంతగడ్డపై పులుల్లా చెలరేగిపోయే ఆస్ట్రేలియా.. పెర్త్ టెస్ట్‌నూ అలాగే స్టార్ట్ చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను భయపెట్టింది. పదునైన పేస్ బౌలింగ్‌తో మన బ్యాటింగ్ ఆర్డర్‌ను ఛిన్నాభిన్నం చేసింది. దీంతో 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది బుమ్రా సేన. ఇక మ్యాచ్ భారత్ చేజారిందని అంతా అనుకున్నారు. గెలుపు, డ్రా కాదు.. ఓటమి తప్పించుకుంటే గ్రేట్ అనుకున్నారు. భారీ తేడాతో ఓడిపోకపోతే అదే గొప్పని భావించారు. కానీ ఒక్క మెసేజ్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి కోచ్ గౌతం గంభీర్ పంపిన సందేశంతో టీమిండియా చెలరేగిపోయింది.
సైనికుడిలా పోరాడు..
గంభీర్ పంపిన మెసేజ్‌తో తన నెత్తురు మరిగిందన్నాడు యంగ్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి. బోర్డర్‌లో సైనికుడిలా పోరాడమంటూ గౌతీ ధైర్యం నింపడంతో తాను చెలరేగానని ఈ తెలుగోడు చెప్పాడు. ‘సరిహద్దుల్లో సైనికుడు ప్రత్యర్థుల తూటా దెబ్బలు తట్టుకొని నిలబడతాడు. ఓటమి ఒప్పుకోకుండా పోరాడతాడు. నువ్వూ అలాగే చెయ్ అని గంభీర్ చెప్పాడు. బౌన్సర్ వస్తే చాలు భుజాల మీద నుంచి భారీ షాట్‌గా మలిచేసెయ్. బౌన్సర్‌ను బుల్లెట్ మాదిరిగా ట్రీట్ చెయ్. వాటిని తట్టుకొని నిలబడు. ఆ బాల్ వస్తే అటాక్ చెయ్’ అని గౌతీ తనకు సూచించాడని నితీష్ రివీల్ చేశాడు. బౌలింగ్ టైమ్‌లోనూ ఇంకో సలహా ఇచ్చాడని తెలిపాడు.
బంతితోనే జవాబు..
బాల్‌తో ప్రత్యర్థులకు గట్టి సమాధానం ఇవ్వాలని గంభీర్ బౌలర్లకు సూచించాడని నితీష్ తెలిపాడు. మాటలు కాదు.. వికెట్లు తీసి మీరేంటో నిరూపించండి అని క్లియర్ మెసేజ్ ఇచ్చాడని పేర్కొన్నాడు. దీంతో బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేశారని.. అటాకింగ్ లెంగ్త్స్‌లో బౌలింగ్ చేస్తూ ఆసీస్ బ్యాటర్ల భరతం పట్టారని వ్యాఖ్యానించాడు. బ్యాటింగ్ సమయంలో గౌతీ మెసేజ్‌తో తనకు నెత్తురు మరిగిందని, దీంతో కమిన్స్ బౌలింగ్‌లో బౌన్సర్‌ను సిక్స్‌గా మలిచానని అతడు వివరించాడు. ఇలా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ టైమ్‌లో మ్యాచ్‌ను డ్రెస్సింగ్ రూమ్ నుంచే మలుపు తిప్పాడు గంభీర్. కాగా, ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నితీష్ 59 బంతుల్లో 41 పరుగులు చేశాడు. టీమ్‌లో అతడే టాప్ స్కోరర్ కావడం గమనార్హం.
Also Read:
ఆసీస్ బెండు తీసిన తెలుగోడు.. చేజారిన మ్యాచ్‌ను నిలబెట్టాడు
టీమిండియాను రెచ్చగొట్టిన లబుషేన్.. మళ్లీ నోరెత్తకుండా
వరల్డ్ కప్ హీరోను వణికించిన హర్షిత్ రాణా.. ఏం బౌలింగ్ భయ్యా
For More Sports And Telugu News