Share News

Kavitha: రాష్ట్రంలో విధ్వంస పాలన: ఎమ్మెల్సీ కవిత

ABN , Publish Date - Apr 05 , 2025 | 03:52 AM

రాష్ట్రంలో ప్రస్తుతం విధ్వంసకర పాలన సాగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.

Kavitha: రాష్ట్రంలో విధ్వంస పాలన: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రస్తుతం విధ్వంసకర పాలన సాగుతోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో నెమళ్లు అరుస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని, జింకలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని, ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


దాశరథి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ జాగృతి రూపొందించిన ‘‘ఆ చల్లని సముద్ర గర్భం’’ దృశ్య గీతాన్ని ప్రసాద్‌ ల్యాబ్‌లో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివా్‌సతో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలనలో ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకంగా మరో ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 03:52 AM