Share News

IND vs AUS: బ్రిస్బేన్ లో టెస్టు.. యువ ఆటగాడిపై టీమిండియా వేటు..

ABN , Publish Date - Dec 10 , 2024 | 01:59 PM

అరంగేట్రం మ్యాచులోనే అందరి అంచనాలను తలకిందులు చేసిన ఓ యువ ఆటగాడు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. రెండో టెస్టులో ఉసూరుమనిపించి అభిమానుల ఆగ్రహాన్ని చవిచూసిన ఈ క్రికెటర్ ను పక్కన పెట్టాలని టీమిండియా భావిస్తోందట...

IND vs AUS: బ్రిస్బేన్ లో టెస్టు.. యువ ఆటగాడిపై టీమిండియా వేటు..
Team India

ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఓడిపోయిన టీమిండియా ప్రస్తుతం జట్టులో కీలక మార్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టులో యువ సంచలనంగా పేరు సంపాదించిన హర్షిత్ రానాను మూడో టెస్టుకు దూరం చేయనున్నట్టు తెలుస్తోంది. ఆడిలైడ్ లో రెండో టెస్టు సందర్భంగా రాణా ప్రదర్శన టీమిండియాను నిరాశపరిచింది. ఈ సిరీస్ తో ఇంటర్నేషనల్ మ్యాచుల్లో అరంగేట్రం చేసిన రాణా పెర్త్ లో జరిగిన తొలి మ్యాచ్ లో అదరగొట్టాడు. కానీ, రెండో టెస్టులో తోటి ఆటగాళ్లలాగానే ఒత్తిడిని మ్యానేజ్ చేయలేక ఆసిస్ బ్యాటర్ల చేతిలో కుప్పకూలాడు.


రంగంలోకి కర్నాటక స్టార్..

రెండో టెస్టులో ఆస్ట్రేలియన్ దిగ్గజాలు మార్నస్ లబూచేన్, ట్రావిస్ హెడ్ వంటి భయంకరమైన ఆటగాళ్లను ఎదుర్కోలేక తడబడ్డాడు. లైన్, లెంత్ ను మెయింటైన్ చేయలేకపోవడంతో ఆస్ట్రేలియన్ జట్టు తొలి ఇన్నింగ్స్ లోనే 180 స్కోరుతో లీడ్ లో నిలిచారు. దీంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు అతడిపై విమర్శలు గుప్పించారు. దీంతో భారత్ కు అత్యంత కీలకమైన మూడో టెస్టులో రాణా ఆడతాడా లేదా అనే విషయం సందిగ్ధంలో పడింది. ఇదే విషయంలో టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ రాణాపై పబ్లిక్ గానే కామెంట్స్ చేశాడు. మూడో టెస్టులో అతడి వల్ల పెద్దగా ఉపయోగం లేదని తేల్చి చెప్పాడు. అతడి స్థానంలో కర్నాటక స్టార్ ప్లేయర్ ప్రసీద్ కృష్ణను ప్లేయింగ్ ఎలెవన్ లోకి తీసుకోవాలని సూచించాడు.


ఇచ్చినట్టే ఇచ్చి లాక్కుంటారా..?

రాణాపై అభిమానులు కోపంగా ఉన్నప్పటికీ భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం రాణాను వెనకేసుకొచ్చాడు. ‘‘రెండు మ్యాచుల్లో ప్రదర్శన ఆధారంగానే ఆటగాళ్లను జట్టు నుంచి పక్కనపెట్టడం అంత గొప్ప విషయం కాదు. రెండో టెస్టులో రాణా అనుభవలేమిని ఆస్ట్రేలియా జట్టు అడ్వాంటేజ్ గా తీసుకుని చెలరేగిపోయారు’’ అంటూ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో రోహిత్ వెల్లడించాడు. రాణాను జట్టులో చేర్చుకోవడంపై క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు ఉన్నపాటుగా అతడి నుంచి ఈ అవకాశాన్ని లాక్కోవడం సరికాదని కొందరు మాజీలు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు చెప్తున్న మాట ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచుల్లో పోటీపడుతున్నప్పుడు క్రికెటర్లు స్పోర్టీవ్ గా ఉండాలని జట్టు ప్రయోజనాలకే పెద్ద పీట వేయాలని అంటున్నారు. బ్రిస్బెన్ వేదికగా డిసెంబర్ 10న మూడో టెస్టు ఆడేందుకు ఆసిస్, టీమిండియా జట్లు సిద్ధంగా ఉన్నాయి. దీంతో రాణా సామర్థ్యాలతో పాటు అతడి రీసెంట్ ఫామ్ ను సైతం సెలక్టర్లు పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. జట్టు నుంచి రాణాను తొలగిస్తే అది అతడిలాంటి మరెంతోమంది యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Team India: టీమిండియాలో బుమ్రాను మించిన బౌలర్.. అతడి ముందు సిరాజ్ జుజుబి.. వెస్టిండీస్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు


Updated Date - Dec 10 , 2024 | 03:34 PM