Harbhajan Singh: ఇది చాలా చెత్త ప్రశ్న.. ధోనీతో అతడికి పోలికా?.. పాక్ జర్నలిస్ట్‌కు హర్భజన్ కౌంటర్!
ABN , Publish Date - Jul 20 , 2024 | 09:17 AM
ప్రపంచ క్రికెట్‌లో వికెట్ కీపింగ్‌లో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పిన ఆటగాడు ఎంఎస్ ధోనీ. వికెట్ కీపింగ్ బ్యాటర్లలో ధోనీని మించిన ఆటగాడు దాదాపు లేడనే చెప్పాలి. ఆడమ్ గిల్‌క్రిస్ట్, కుమార సంగక్కర కూడా కీపింగ్ విషయంలో ధోనీ తర్వాతనే అని చాలా మంది మాజీ క్రీడాకారులు గతంలో అభిప్రాయపడ్డారు.
ప్రపంచ క్రికెట్‌లో వికెట్ కీపింగ్‌లో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పిన ఆటగాడు ఎంఎస్ ధోనీ (MS Dhoni). వికెట్ కీపింగ్ బ్యాటర్లలో ధోనీని మించిన ఆటగాడు దాదాపు లేడనే చెప్పాలి. ఆడమ్ గిల్‌క్రిస్ట్, కుమార సంగక్కర కూడా కీపింగ్ విషయంలో ధోనీ తర్వాతనే అని చాలా మంది మాజీ క్రీడాకారులు గతంలో అభిప్రాయపడ్డారు. అలాంటిది ఓ పాకిస్తాన్ జర్నలిస్ట్ (Pakistan Journalist ).. ధోనీతో మహ్మద్ రిజ్వాన్‌ను పోల్చడం మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh )కు కోపం తెప్పించింది. దీంతో హర్భజన్ కాస్త ఘాటుగా స్పందించాడు. ధోనీతో పోల్చే అర్హత రిజ్వాన్ (Mohammad Rizwan)కు లేదని కౌంటర్ ఇచ్చాడు.
పాకిస్తాన్‌కు చెందిన ఓ జర్నలిస్ట్ ధోనీ, రిజ్వాన్ ఫొటోలను పక్కపక్కనే పెట్టి ``ఎవరు అత్యుత్తమం`` అని క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్ట్‌పై భజ్జీ తనదైన శైలిలో స్పందించాడు. ``ఇది చాలా చెత్త ప్రశ్న. రిజ్వాన్ కంటే ధోనీ చాలా ముందుంటాడు. ఇందులో ఎలాంటి అనుమానమూ అక్కర్లేదు. నిజానికి రిజ్వాన్ ఆటతీరు నాకు కూడా నచ్చుతుంది. ఎప్పుడూ నిజాయితీగా ఆడడానికి ప్రయత్నిస్తాడు. అయితే అతడిని ధోనీతో పోల్చడం చాలా తప్పు. ఇప్పటికీ ప్రపంచ క్రికెట్‌లో ధోనీని మించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ లేడు. వికెట్ల వెనుక ధోనీ అంత చురుగ్గా ఉండే వారు చాలా అరుదు. ఆ జాబితాలో ధోనీని మించిన వారు లేరు`` అని హర్భజన్ పేర్కొన్నాడు.
కేవలం వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గానే కాదు.. కెప్టెన్‌గా కూడా ధోనీ పలు అరుదైన ఘనతలు సాధించాడు. ధోనీ సారథ్యంలోనే టీమిండియా టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీల్లో విజేతగా నిలిచింది. మరోవైపు రిజ్వాన్ పాకిస్తాన్ తరఫున వికెట్ కీపర్ బ్యాటర్‌గా మెరుగ్గా రాణిస్తున్నాడు. తన దూకుడైన బ్యాటింగ్‌తో మాజీల ప్రశంసలు అందుకుంటున్నాడు.
ఇవి కూడా చదవండి..
Ishan Kishan: ఇషాన్ కిషన్ మళ్లీ జట్టులోకి రావడానికి మార్గాలున్నాయా? అలా చేస్తేనే ఇక ఛాన్స్..!
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..