Share News

పాకిస్థాన్‌కు ఐసీసీ ఝలక్‌

ABN , Publish Date - Nov 17 , 2024 | 05:51 AM

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) గట్టి షాకిచ్చింది. తమను సంప్రదించకుండా పాకిస్థాన్‌లో చాంపియన్స్‌ ట్రోఫీని ప్రదర్శించే షెడ్యూల్‌

పాకిస్థాన్‌కు ఐసీసీ ఝలక్‌

చాంపియన్స్‌ ట్రోఫీ ప్రదర్శన వేదికల నుంచి

ఆ నగరాలు అవుట్‌

దుబాయ్‌: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) గట్టి షాకిచ్చింది. తమను సంప్రదించకుండా పాకిస్థాన్‌లో చాంపియన్స్‌ ట్రోఫీని ప్రదర్శించే షెడ్యూల్‌ ప్రకటించడం..వివాదాస్పద పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని నగరాలను అందులో చేర్చడాన్ని తీవ్రంగా పరిగణించింది. శనివారం విడుదలజేసిన ట్రోఫీ ప్రదర్శన షెడ్యూల్‌నుంచి పీవోకేలోని నాలుగు నగరాలను తొలగించింది. పీసీబీ ప్రకటించిన షెడ్యూల్‌ను ఐసీసీ రద్దు చేసింది. అంతేకాదు తాజా షెడ్యూల్‌ను వెలువరించింది. చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొంటున్న ఎనిమిది జట్ల దేశాలలో ట్రోఫీని ప్రదర్శించనున్నారు. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరగాల్సివుంది.

Updated Date - Nov 17 , 2024 | 05:52 AM