Share News

5 పరుగులు 4 వికెట్లు

ABN , Publish Date - Dec 03 , 2024 | 01:16 AM

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో విండీస్‌ పేసర్‌ జేడన్‌ సీల్స్‌ (4/5) అత్యంత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సంచలనం సృష్టించాడు.

5 పరుగులు 4 వికెట్లు

సీల్స్‌ సూపర్‌ బౌలింగ్‌

బంగ్లా తొలి ఇన్నింగ్స్‌ 164

కింగ్‌స్టన్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో విండీస్‌ పేసర్‌ జేడన్‌ సీల్స్‌ (4/5) అత్యంత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సంచలనం సృష్టించాడు. 15.5 ఓవర్లు వేసిన తను కేవలం ఐదు పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం విశేషం. ఇందులో పది మెయిడిన్‌ ఓవర్లున్నాయి. 1978 తర్వాత టెస్టుల్లో నమోదైన అత్యంత పొదుపైన బౌలింగ్‌ ఇదే. ఓవరాల్‌గా టెస్టు చరిత్రలో అత్యంత ఎకానమీ బౌలింగ్‌ భారత్‌కు చెందిన ఆర్‌జీ నాద్‌కర్ణి (32-27-5-0) పేరిట ఉంది. ఇక 122/6 ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లా 164 పరుగులకే కుప్పకూలింది. మెహిదీ హసన్‌ (36), తైజుల్‌ (16) ఓ మాదిరిగా రాణించారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 146 పరుగులకు ఆలౌటైంది. అనంతం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బంగ్లా.. కడపటి వార్తలందేసరికి వికెట్‌ నష్టానికి 18 పరుగులు చేసింది.

Updated Date - Dec 03 , 2024 | 01:17 AM

News Hub