T20 World Cup: ప్రపంచకప్‌లో కోహ్లీని అలా ఉపయోగించుకోవాలి.. ఆ ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలియదు: గంగూలీ
ABN , Publish Date - May 11 , 2024 | 12:53 PM
ప్రస్తుత ఐపీఎల్‌లో బ్యాట్‌తో అదరగొడుతున్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ప్రపంచకప్‌నకు ఎంపిక చేయడం గురించి టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. వచ్చే నెల ప్రారంభం నుంచి అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరగబోయే టీ-20 ప్రపంచకప్ జరగబోతోంది.
ప్రస్తుత ఐపీఎల్ (IPL 2024)లో బ్యాట్‌తో అదరగొడుతున్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli)ని ప్రపంచకప్‌నకు ఎంపిక చేయడం గురించి టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) స్పందించాడు. వచ్చే నెల ప్రారంభం నుంచి అమెరికా-వెస్టిండీస్ వేదికగా టీ-20 ప్రపంచకప్ (T20 World Cup) జరగబోతోంది. ఈ టోర్నీలో టీమిండియా గేమ్ ప్లాన్ గురించి గంగూలీ స్పందించాడు. కోహ్లీని మూడో స్థానంలో కాకుండా, ఓపెనర్‌గా బరిలోకి దింపాలని సూచించాడు.
``విరాట్ అద్భుతంగా ఆడుతున్నాడు. గత మ్యాచ్‌లో కోహ్లీ ఆడిన విధానం అతడి ఫామ్‌ను సూచిస్తోంది. ప్రపంచకప్‌లో అతడిని ఓపెనర్‌గా ఉపయోగించుకోవాలి. టీ20 ప్రపంచకప్ గెలిచే సత్తా ఈ జట్టుకు ఉంది. జట్టు సమతూకంతో ఉంది. 17 ఏళ్ల తర్వాత మళ్లీ కచ్చితంగా టైటిల్ గెలుస్తుందని భావిస్తున్నా. దినేష్ కార్తీక్ బాగానే ఆడుతున్నప్పటికీ అతడిని ప్రపంచకప్ జట్టులోకి తీసుకోకపోవడం మంచి నిర్ణయమే. అతడి కంటే రిషబ్ పంత్, సంజూ శాంసన్‌ను తీసుకోవడం మంచి ఆలోచన`` అని అన్నాడు.
ఇక, ఇటీవల హైదారాబాద్‌తో మ్యాచ్ అనంతరం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) ఓనర్ సంజీవ్ గోయెంకా (Sanjiv Goenka), జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul)కు వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై గంగూలీ ఆచితూచి స్పందించాడు. ``హైదరాబాద్‌తో మ్యాచ్ అనంతరం సంజీవ్, రాహుల్ మధ్య సీరియస్‌గా జరిగిన చర్చను టీవీల్లో చూశాం. వారు ఏం మాట్లాడుకున్నారనేది తెలియదు. అలాంటపుడు కామెంట్ చేయడం బాగోదు. దానిని వదిలేయడమే బెటర్`` అని గంగూలీ అన్నాడు.
ఇవి కూడా చదవండి..
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి రోహిత్ శర్మ గుడ్ బై..?
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..