Sunil Chhetri: ఫుట్‌బాల్ దిగ్గజం సంచలన ప్రకటన.. అదే చివరి మ్యాచ్
ABN , Publish Date - May 16 , 2024 | 03:20 PM
భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ తాజాగా సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌కు తాను వీడ్కోలు పలుకుతున్నట్టు గురువారం పేర్కొన్నాడు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియో..

భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ (Sunil Chhetri) తాజాగా సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌కు తాను వీడ్కోలు పలుకుతున్నట్టు గురువారం పేర్కొన్నాడు. తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన వీడియో ద్వారా అతను ఈ విషయాన్ని క్రీడాభిమానులతో పంచుకున్నాడు. ఫిఫా వరల్డ్‌కప్ (Fifa World Cup) క్వాలిఫికేషన్ పోటీలో భాగంగా.. జూన్ 6వ తేదీన కువైట్‌తో జరగనున్న మ్యాచ్ తర్వాత తాను ఫుట్‌బాల్‌కు గుడ్‌బై చెప్పనున్నాడని, అదే తన కెరీర్‌లో చివరి మ్యాచ్ అని తెలిపాడు.
రిటైర్‌మెంట్‌పై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు.. ఒక్కసారి వీడ్కోలు పలికితే..
39 ఏళ్ల ఛెత్రీ తన రిటైర్‌మెంట్‌ని ప్రకటిస్తూ.. ‘‘గత 19 ఏళ్లలో విధి నిర్వహణ, ఒత్తిడి, సంతోషాలు.. ఇలా ఎన్నో భావోద్వేగాలను నేను నెమరవేసుకుంటూ వచ్చాను. అసలు దేశం కోసం ఇన్ని మ్యాచ్‌లు ఆడుతానని ఎన్నడూ ఊహించలేదు. మంచో చెడో తెలీదు కానీ, కెరీర్ పరంగా ఓ నిర్ణయం తీసుకున్నా. గత రెండున్నర నెలలుగా ఇదే ఆలోచిస్తూ వస్తున్నా. జూన్ 6న కువైట్‌తో ఆబోయే మ్యాచ్.. నా కెరీర్‌లో చివరి మ్యాచ్ అవుతుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు. తదుపరి రౌండ్‌కు అర్హత సాధించేందుకు తమకు మూడు పాయింట్లు అవసరమని.. కాబట్టి కువైట్‌తో జరిగే మ్యాచ్ ఎంతో ముఖ్యమైందని ఆ వీడియోలో చెప్పాడు.
విమానంలో షాకింగ్ సీన్.. ఎయిర్ హోస్టెస్ బాత్రూంలోకి వెళ్లి చూస్తే..
ఇదిలావుండగా.. 1984 ఆగష్టు 3వ తేదీన సునీల్ ఛెత్రీ జన్మించాడు. 2002లో ఫ్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఛెత్రీ.. 2005 జూన్ 12న పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌ని ప్రారంభించాడు. అనతికాలంలోనే కెప్టెన్‌గా ఎదిగిన అతను.. తన కెరీర్‌లో 150 మ్యాచ్‌లలో 94 గోల్స్ సాధించాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ఫుట్‌బాలర్లలో క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీల తర్వాత ఛెత్రీనే అంతర్జాతీయ స్థాయిలో ఎక్కువ గోల్స్ సాధించాడు. ఫుల్‌బాల్ రంగంలో అందించిన విశేష సేవలకు గాను.. అర్జున, పద్మశ్రీ, ఖేల్‌రత్న వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నాడు.
Read Latest Sports News and Telugu News