Share News

WV Raman: భారత్ చీఫ్ కోచ్ పదవికి గంభీర్‌తో పోటీ పడుతున్న రామన్ ఎవరు?

ABN , Publish Date - Jun 19 , 2024 | 01:14 PM

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) త్వరలో టీమ్ ఇండియా కొత్త ప్రధాన కోచ్‌ని(India head coach) ప్రకటించనుంది. ఈ రేసులో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్(gautam Gambhir) ముందంజలో ఉన్నాడు. అయితే ఈ పోటీలో డబ్ల్యూవీ రామన్‌ను(WV Raman) కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన ఎవరనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

WV Raman: భారత్ చీఫ్ కోచ్ పదవికి గంభీర్‌తో పోటీ పడుతున్న రామన్ ఎవరు?
wv Raman competing with gautam Gambhir

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) త్వరలో టీమ్ ఇండియా కొత్త ప్రధాన కోచ్‌ని(India head coach) ప్రకటించనుంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను బోర్డు దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ రేసులో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్(gautam Gambhir) ముందంజలో ఉన్నాడు. అయితే బీసీసీఐ, క్రికెట్ సలహా కమిటీ ఇటివల గంబీర్‌ను ఇంటర్వ్యూ చేసింది. దీంతో పాటు డబ్ల్యూవీ రామన్‌ను(WV Raman) కూడా ఇంటర్వ్యూ చేసింది. ఈ నేపథ్యంలో అసలు ఎవరు కోచ్ గా వస్తారనే ఉత్కంఠ క్రీడాభిమానుల్లో నెలకొంది. అయితే అసలు గంబీర్‌కు పోటీగా వచ్చిన WV రామన్ ఎవరు, గట్టీ పోటీ ఇస్తున్న ఆయన విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం?


అద్భుతమైన రన్ స్కోరర్

చెన్నైకి చెందిన రామన్ భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. ఆయన ఫస్ట్ క్లాస్ కెరీర్ 1982 నుంచి 1999 వరకు కొనసాగింది. ఆయన తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించాడు. తమిళనాడు(tamilnadu) తరఫున అద్భుతమైన రన్ స్కోరర్. ఆ క్రమంలో 7,939 ఫస్ట్ క్లాస్ పరుగులు చేశాడు. ఆయన అత్యుత్తమ ప్రదర్శన 1988-89 సీజన్‌లో 1018 పరుగులు చేశాడు. ఇది ఆ సమయంలో రికార్డు కావడం విశేషం. ఇప్పటి వరకు కేవలం 15 మంది బ్యాట్స్‌మెన్ మాత్రమే ఈ మార్కును అధిగమించారు. ఆ సీజన్‌లో రామన్ రెండు డబుల్ సెంచరీలు, ఒక ట్రిపుల్ సెంచరీ సాధించాడు.


అంతర్జాతీయ క్రికెట్‌లో

అంతర్జాతీయ క్రికెట్‌లో రామన్‌(raman)కు మంచి ఆరంభం లభించింది. చెన్నై(chennai)లోని తన సొంత మైదానంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆయన 83 పరుగులు చేసి ఒక వికెట్ తీసుకున్నాడు. దీంతో 1992లో దక్షిణాఫ్రికాలో వన్డే సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. కానీ అంతర్జాతీయ కెరీర్లో కేవలం 28 మ్యాచ్‌లు మాత్రమే కొనసాగాడు. రామన్ 11 టెస్టుల్లో 24.89 సగటుతో 448 పరుగులు చేశాడు. 96 అత్యధిక స్కోరు కాగా, 4 అర్ధ సెంచరీలు చేశాడు. 27 వన్డేల్లో 23.73 సగటుతో 617 పరుగులు చేశాడు. టెస్టు, వన్డేల్లో కలిపి 2-2 వికెట్లు తీశాడు.


పలు వివాదాలు..

రామన్ అంతర్జాతీయ కెరీర్ చిన్నదే అయినప్పటికీ చాలా కాలం పాటు భారత కోచింగ్ సర్క్యూట్‌లో ఉన్నాడు. తమిళనాడు (2005-2007), బెంగాల్ (2001-02, 2010-13) కోచ్‌గా కాకుండా కింగ్స్ XI పంజాబ్ (2013)కి అసిస్టెంట్ కోచ్‌గా, కోల్‌కతా నైట్ రైడర్స్ (2014) బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కూడా పనిచేశాడు. 2015 నుంచి అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో రామన్ భారతదేశంలో A, దులీప్ ట్రోఫీ, అండర్ 19 జట్లకు కోచ్‌గా కూడా పనిచేశాడు. డిసెంబర్ 2018లో రమేష్ పొవార్ స్థానంలో రామన్ భారత మహిళల జట్టు కోచ్‌గా నియమితులయ్యారు. అతను మే 2021 వరకు ఈ పదవిలో కొనసాగాడు. ఈ క్రమంలో పలు వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. దీంతో ఆయనను ఈ పదవి నుంచి తొలగించారు. టీ20 ప్రపంచకప్ 2024(T20 World Cup 2024) తర్వాత భారత ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) పదవీకాలం ముగియనుంది. ప్రధాన కోచ్ పదవికి ద్రవిడ్ మళ్లీ దరఖాస్తు చేసుకోలేదు.


ఇది కూడా చదవండి:

Kane Williamson: కెప్టెన్సీ నుంచి వైదొలగిన కేన్ విలియమ్సన్.. కారణమిదే!

సఫారీలకు సవాల్‌


Supreme Court : తప్పు జరిగితే ఒప్పుకోండి


Rahul Gandhi : 24 లక్షల మంది భవిష్యత్తు గందరగోళం

Read Latest Cricket News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 01:19 PM