Share News

Kane Williamson: కెప్టెన్సీ నుంచి వైదొలగిన కేన్ విలియమ్సన్.. కారణమిదే!

ABN , Publish Date - Jun 19 , 2024 | 08:48 AM

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024(ICC T20 World Cup 2024)లో కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్ (New Zealand) జట్టు సూపర్ 8లో తన స్థానాన్ని కాపాడుకోవడంలో విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే స్టార్ ఆటగాడు, కెప్టెన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

Kane Williamson: కెప్టెన్సీ నుంచి వైదొలగిన కేన్ విలియమ్సన్.. కారణమిదే!
Kane Williamson resigns as New Zealand white ball captain

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో (ICC T20 World Cup 2024) కేన్ విలియమ్సన్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్ (New Zealand) జట్టు సూపర్ 8 దశకు చేరడంలో విఫలమైంది. ఈ టోర్నీలో గ్రూప్-సిలో భాగమైన కివీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్‌లపై ఘోర పరాజయాలను చవిచూసింది. పర్యవసానంగా నాకౌట్‌లో అడుగుపెట్టలేకపోయింది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో కివీస్‌ జట్టు గ్రూప్‌ దశ దాటకపోవడం ఇదే తొలిసారి.

జట్టు పేలవమైన ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ కేన్ విలియమ్సన్(Kane Williamson) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2024-25 సీజన్‌కు సంబంధించిన కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్‌ను అంగీకరించబోనని చెప్పాడు. పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్సీకి కూడా కేన్ మామ గుడ్‌బై చెప్పాడు. ఈ మేరకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. స్టార్ బ్యాట్స్‌మెన్ తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల అభిమానులు నిరాశ చెందుతున్నారు.


న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ప్లేయర్స్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి విలియమ్సన్ వైదొలగాడని, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కెప్టెన్సీని కూడా వదులుకున్నాడని వివరించింది. కాగా తన నిర్ణయానికి సంబంధించి, కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. జట్టు అన్ని ఫార్మాట్లలో పురోగతి సాధించడంలో సహాయం పట్ల తాను సంతోషంగా ఉన్నానని, భవిష్యత్తులో కూడా సహకరిస్తానని వ్యాఖ్యానించాడు. ‘‘ నేను సెంట్రల్ కాంట్రాక్టును అంగీకరించలేను. న్యూజిలాండ్‌కు ఆడటం నాకు చాలా ముఖ్యం. జట్టు కోసం ఆడటం నాకు ఇప్పటికీ ముఖ్యం. అయితే క్రికెట్ వెలుపల నా జీవితం చాలా మారిపోయింది. ప్రస్తుతం నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను’’ అని విలియమ్సన్ స్పష్టం చేశాడు.


ఇప్పటికే టెస్టులో

ఇప్పటికే టెస్టు క్రికెట్‌లో న్యూజిలాండ్ జట్టు కెప్టెన్సీ నుంచి కేన్ విలియమ్సన్ తప్పుకోగా, ఇప్పుడు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో జట్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. కేన్ విలియమ్సన్ 91 వన్డేలు, 75 టీ20 మ్యాచ్‌లకు కివీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ కాలంలో కివీ జట్టు 47 వన్డేలు, 39 టీ20 మ్యాచ్‌లు గెలిచింది. కేన్ విలియమ్సన్‌తో పాటు, న్యూజిలాండ్ జట్టు ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కూడా సెంట్రల్ కాంట్రాక్ట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.


ఇది కూడా చదవండి:

సఫారీలకు సవాల్‌


Supreme Court : తప్పు జరిగితే ఒప్పుకోండి


Rahul Gandhi : 24 లక్షల మంది భవిష్యత్తు గందరగోళం

Read Latest Cricket News and Telugu News

Updated Date - Jun 19 , 2024 | 10:54 AM