Share News

Poco X6 series: నేడే పోకో X6 సిరీస్ ఇండియాలో లాంచ్..ధర, ఫీచర్లు చుశారా?

ABN , Publish Date - Jan 11 , 2024 | 11:30 AM

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Poco X6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు ఈరోజు మరికొన్ని గంటల్లో దేశీయ మార్కెట్లోకి రానుంది. సాయంత్రం 5:30 గంటలకు ఈ సిరీస్‌ ఫోన్లు భారతదేశంలో ప్రారంభం కానున్నాయి.

 Poco X6 series: నేడే పోకో X6 సిరీస్ ఇండియాలో లాంచ్..ధర, ఫీచర్లు చుశారా?

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Poco X6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు ఈరోజు మరికొన్ని గంటల్లో దేశీయ మార్కెట్లోకి రానుంది. సాయంత్రం 5:30 గంటలకు ఈ సిరీస్‌ ఫోన్లు భారతదేశంలో ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్ కింద Poco X6, Poco X6 ప్రోతో సహా 2 స్మార్ట్‌ఫోన్‌లు ప్రారంభించబడతాయి. రెండు మొబైల్ ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు లాంచ్‌కు ముందే లీక్ అయ్యాయి.

భారతదేశంలో Poco X6 ధర రూ.20 వేల నుంచి 22,000 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. అదేవిధంగా Poco X6 ప్రో ధర రూ. 25 వేల నుంచి రూ.30,000 మధ్య ఉండవచ్చని టెక్ వర్గాలు అంటున్నాయి. అయితే స్టోరేజ్ నిల్వ వేరియంట్‌ని బట్టి ధర ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు.


ప్రో మోడల్‌లో మీరు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల 1.5K OLED స్క్రీన్, మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్, మూడు 64+8+2MP కెమెరాలు, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ని పొందవచ్చు. ఫోన్ 5000 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. బూడిద, నలుపు, పసుపు రంగులలో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రో మోడల్‌లో మీరు HyperOSని చూడవచ్చు.

బేస్ మోడల్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 13 ఆధారంగా MIUI 14, 5100 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్‌తో Snapdragon 7s Gen 2 SoC చిప్‌సెట్‌తో లభ్యం కానుంది. ఇక Poco తర్వాత Samsung Galaxy S24 సిరీస్‌ను జనవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Updated Date - Jan 11 , 2024 | 11:30 AM