Samsung: 6,000 mAh బ్యాటరీతో మార్కెట్లోకి శాంసంగ్ కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చుశారా?
ABN , Publish Date - Mar 04 , 2024 | 04:35 PM
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ భారతదేశంలో మరో 5జీ స్మార్ట్‌ఫోన్ Galaxy F15 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత, ఎప్పుడు విక్రయిస్తారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
Samsung Galaxy F15 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్(Samsung) భారతదేశంలో మరో 5జీ స్మార్ట్‌ఫోన్ Galaxy F15 మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి. ధర ఎంత, ఎప్పటి నుంచి విక్రయిస్తున్నారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.5 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే 4 సంవత్సరాల OS అప్‌డేట్‌లతో వస్తుంది. గెలాక్సీ F15 5G స్మార్ట్‌ఫోన్‌లో MediaTek 6100+ ప్రాసెసర్ సపోర్ట్ అందించబడింది.
దీనిలో 50MP + 5MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 13MP ఫ్రంట్ కెమెరా సెటప్ ఉన్నాయి. 6000mAh శక్తివంతమైన బ్యాటరీతో లభిస్తుంది. ఇది రెండు స్టోరేజ్ సపోర్టులతో వస్తుంది. 4GB + 128GB వేరియంట్ ధర రూ. 12,999 కాగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ.14499గా ఉంది. కానీ ప్రారంభ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌లపై కస్టమర్లకు రూ.1000 తగ్గింపును కూడా అందిస్తున్నారు.
ఈ స్మార్ట్‌ఫోన్ మూడు రంగు ఎంపిక(జాజీ గ్రీన్, యాష్ బ్లాక్, గ్రూవీ వైలెట్)లలో లభిస్తుండగా.. రూ.11,999 ప్రారంభ ధరతో లాంచ్ చేయబడింది. అయితే ఈ 5G ఫోన్ ముందస్తు విక్రయాలు మార్చి 4న రాత్రి 7 గంటల నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఈ కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్(flipkart) లేదా అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
Samsung Galaxy F15 5Gలో ప్రత్యేక వాయిస్ ఫోకస్ టెక్నాలజీని ఉపయోగించినట్లు Samsung తెలిపింది. దీనిలో మీరు కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని తగ్గించవచ్చు. ఇది కాకుండా మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా ఫోన్‌లో క్విక్ షేర్‌ని ఉపయోగించవచ్చు. ఇది ఇంటర్నెట్ లేకుండా ఫోటోలు, వీడియోలను బదిలీ చేయడానికి అనుమతిస్తుందని కంపెనీ తెలిపింది.
మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి: India Growth Rate: భారత్ వృద్ధి రేటు అంచనాలను భారీగా పెంచిన గ్లోబల్ సంస్థ