Share News

Nandyala: మైనర్లే రేప్‌ చేసి చంపేశారు!

ABN , Publish Date - Jul 12 , 2024 | 04:55 AM

వారు ముగ్గురూ మైనర్లే! ఒకరు ఆరో తరగతి, మరో ఇద్దరు పదో తరగతి చదువుతున్నారు. నిండా పదిహేనేళ్లు కూడా లేవు! కానీ.. 9ఏళ్ల బాలికను అపహరించి, అఘాయిత్యం చేసి చంపేసి, మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో అసలు గుట్టును బయటపెట్టారు.

Nandyala: మైనర్లే రేప్‌ చేసి చంపేశారు!

  • ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికను అపహరించి, అఘాయిత్యం

  • నంద్యాల జిల్లాను కుదిపేస్తున్న బాలిక మిస్సింగ్‌ కేసు

  • నిందితుల్లో ఒకరు 6వతరగతి, మరో ఇద్దరు టెన్త్‌ క్లాస్‌

నందికొట్కూరు/ పగిడ్యాల, జూలై 11: వారు ముగ్గురూ మైనర్లే! ఒకరు ఆరో తరగతి, మరో ఇద్దరు పదో తరగతి చదువుతున్నారు. నిండా పదిహేనేళ్లు కూడా లేవు! కానీ.. 9ఏళ్ల బాలికను అపహరించి, అఘాయిత్యం చేసి చంపేసి, మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో అసలు గుట్టును బయటపెట్టారు. ఐదు రోజులుగా నంద్యాల జిల్లాను కుదిపేస్తున్న బాలిక అదృశ్యం కేసులో దారుణమిది!. బాలిక ఆచూకీని కనుగొనేందుకు జిల్లా రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం తలమునకలై ఉంది. చివరికి గురువారం ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ (నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్సు) బృందాలు రంగంలోకి దిగాయి. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రి అప్రోచ్‌ కెనాల్‌లో మూడు రోజులుగా అదృశ్యమైన బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.


అసలేం జరిగిందంటే..

నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(9) పాత ముచ్చుమర్రి ఉన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఆదివారం గ్రామంలోని పార్కులో ఆడుకునేందుకు వెళ్లిన ఆ చిన్నారి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ముచ్చుమర్రి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నందికొట్కూరు విజయోత్సవ ర్యాలీలో ఉండగా ఈ విషయం తెలుసుకుని... 24 గంటల్లో బాలిక ఆచూకీ కనుగొనాలని పోలీసులను ఆదేశించారు. దీంతో ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో మూడు రోజులుగా దర్యాప్తు చేపట్టారు. రెండు రోజుల క్రితం డాగ్‌ స్క్వాడ్‌ రంగంలోకి దిగడంతో ఒక చోట క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు, బాలిక దుస్తులు లభ్యమైనట్లు తెలిసింది. కానీ.. ముగ్గురు బాలురు పార్కులో ఆడుకుంటున్న చిన్నారిని కిడ్నాప్‌ చేసి.. అఘాత్యానికి పాల్పడి ఆపై హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.


దీంతో పోలీసులు ఆ ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకొని విచారించగా సంఘటనా స్థలాన్ని చూపించారు. ఆ ముగ్గురిలో ఒకరు(12) ఆరోతరగతి, మరో ఇద్దరు(15) పదో తరగతి చదువుతున్నట్లు చెప్పారు. బాలురు ఇచ్చిన సమాచారం మేరకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం కాలువలో బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గురువారం 30 మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం అత్యాధునిక టెక్నాలజీతో కూడిన కెమెరాలతో నీటిలో తనిఖీ చేశారు. కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ రఘువీర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాప అదృశ్యమై ఐదు రోజులవుతున్నా ఆచూకీ లభించడం లేదని బాలిక కుటుంబ సభ్యులు, వారి బంధువులు కలెక్టర్‌ ఎదుట వాపోయారు. అనుమానితులుగా ఉన్న ముగ్గురు మైనర్‌ బాలురు తప్పుడు సమాచారంతో పోలీసులను పక్కదోవ పట్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Updated Date - Jul 12 , 2024 | 04:55 AM