Share News

Amit Shah: తెలంగాణపై బీజేపీ అగ్రనేతల దండయాత్ర

ABN , Publish Date - Mar 12 , 2024 | 07:59 AM

తెలంగాణపై బీజేపీ అగ్ర నేతలు దండయాత్ర చేయనున్నారు. నేడు రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. పౌరసత్వ సవరణ చట్టం నోటిఫై తర్వాత షా మొదటి టూర్ జరగనుంది. మధ్యాహ్నం 1.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి అమిత్ షా చేరుకోనున్నారు.

Amit Shah: తెలంగాణపై బీజేపీ అగ్రనేతల దండయాత్ర

హైదరాబాద్: తెలంగాణ (Telangana)పై బీజేపీ (BJP) అగ్ర నేతలు దండయాత్ర చేయనున్నారు. నేడు రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) రానున్నారు. పౌరసత్వ సవరణ చట్టం నోటిఫై తర్వాత షా మొదటి టూర్ జరగనుంది. మధ్యాహ్నం 1.20 గంటలకు బేగంపేట (Begumpet) విమానాశ్రయానికి అమిత్ షా చేరుకోనున్నారు. 1.45 నుంచి 2.45వరకు సికింద్రాబాద్ (Secunderabad) ఇంపీరియల్ గార్డెన్స్‌లో సోషల్ మీడియా (Social Media) వారియర్స్‌తో సమావేశం కానున్నారు.

మేం గేట్లు తెరిస్తే బీఆర్‌ఎస్‌ ఖాళీ!

మధ్యాహ్నం 3.15 నుంచి 4.25 గంటల వరకూ ఎల్బీ స్టేడియం (LB Stadium)లో విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 4.45నుంచి 5.45వరకు ఐటీసీ కాకతీయ (ITC Kakatiya)లో పార్టీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికల సమాయత్తత, కార్యచరణపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 6.10 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.

BRS: కరీంనగర్ సభను సెంటిమెంటుగా భావిస్తున్న బీఆర్ఎస్..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 12 , 2024 | 07:59 AM