Share News

ABN Big Debate:ఆ పోస్టుకు నేను ఎలా బాధ్యుడిని.. సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - May 07 , 2024 | 08:12 PM

‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy)సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమానికి నేడు (మంగళవారం) తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విశిష్ఠ అతిథిగా విచ్చేశారు. ఈ డిబేట్‌‌లో పలు కీలక విషయాలను పంచుకున్నారు సీఎం రేవంత్. రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియోలను కాంగ్రెస్ మార్పింగ్ చేసిందని ఆరోపిస్తూ సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ అగ్ర నేతలు కేసు పెట్టారు.

ABN Big Debate:ఆ పోస్టుకు నేను ఎలా బాధ్యుడిని.. సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్
CM Revanth Reddy

ABN Big Debate: ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy)సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమానికి నేడు (మంగళవారం) తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విశిష్ఠ అతిథిగా విచ్చేశారు. ఈ డిబేట్‌‌లో పలు కీలక విషయాలను పంచుకున్నారు సీఎం రేవంత్. రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ మార్పింగ్ చేసిందని ఆరోపిస్తూ సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ అగ్ర నేతలు కేసు పెట్టారు. హైదరాబాద్‌కు ఢిల్లీ పోలీసులు వచ్చి రేవంత్‌కు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ విషయంపై బీజేపీ నేతలపై రేవంత్ పలు విమర్శలు గుప్పించారు.


ఢిల్లీ పోలీసులు తెలంగాణకు వచ్చి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తనను ఢిల్లీకి రావాలంటూ నోటీసు కూడా ఇచ్చారని చెప్పారు. ఎన్నికలు కాగానే ఢిల్లీకి వెళ్తానని.. తనను అరెస్ట్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. సోషల్‌ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సీఎంని బాధ్యుడిని చేస్తారా? అని నిలదీశారు. పరిమితికి మించి రాజకీయ పార్టీలు వ్యవహరించడం మంచిది కాదని హితవు పలికారు. బాధ్యతతో ప్రభుత్వాన్ని నడపాలని తాము అనుకుంటున్నామని ఉద్ఘాటించారు. కాలం ఎటు తీసుకెళ్తే అటు వెళ్లాల్సిందేనని అన్నారు. తాము అన్నింటికి అతీతులమని అనుకోవడం లేదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అనుకోవడం లేదని తేల్చిచెప్పారు. మళ్లీ దేశంలో నియంతృత్వ పాలన కావాలని ప్రజలు కోరుకోవడం లేదని సీఎం రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - May 07 , 2024 | 08:20 PM