Cold Wave: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న చలి
ABN , Publish Date - Dec 31 , 2024 | 05:40 AM
రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. రాబోయే ఐదు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. రాబోయే ఐదు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గడిచిన వారం పది రోజులుగా తుపాన్ ప్రభావంతో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 14-22 డిగ్రీల మధ్య నమోదు అయ్యాయి. చలి తీవ్రత పెద్దగా కనిపించలేదు. ఆదివారం రాత్రి నుంచి మళ్లీ పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు పడిపోయాయి. 14 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11-15 డిగ్రీల మధ్య నమోదు అయ్యాయి. ఆదివారం రంగారెడ్డి జిల్లా చందనవల్లిలో 11.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.