MLC Bypoll Counting: నేడు నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
ABN , Publish Date - Jun 05 , 2024 | 07:36 AM
నేడు నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. నల్గొండలోని దుప్పలపల్లి సెంట్రల్ వేర్ హోసింగ్ గౌడన్స్‌లో లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 4 హాళ్లలో మెత్తం 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లని కలిపి లెక్కించనున్నారు.
నల్గొండ : నేడు నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. నల్గొండలోని దుప్పలపల్లి సెంట్రల్ వేర్ హోసింగ్ గౌడన్స్‌లో లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 4 హాళ్లలో మెత్తం 96 టేబుళ్లను ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లని కలిపి లెక్కించనున్నారు. బరిలో 52 మంది అభ్యర్ధులున్నారు. మొత్తం ఓటర్లు 4,63,839కి గానూ.. 3,36,013 ఓట్లు పోలయ్యాయి. అంటే 72.44% ఓటింగ్ జరిగింది. ఫలితం తేలేంత వరకూ 24 గంటల పాటు రెండు రోజులూ కౌటింగ్ నిర్వహించనున్నారు.
మెదటగా బండిల్స్ కట్టే ప్రక్రియ.. తర్వాత చెల్లుబాటు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేసే ప్రక్రియ చేపడతారు. చెల్లుబాటైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వారే విజేతలుగా నిలవనున్నారు. అలా కాకుంటే రెండో ప్రాధాన్యతలో అభ్యర్థుల గెలుపు కోటా రీచ్ అయ్యేంత వరకూ ఎలిమినేషన్ పద్ధతిలో కౌటింగ్ జరగనుంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపడితే మాత్రం రెండు రోజుల వరకూ కౌంటింగ్ నిర్వహించనున్నారు. మూడు షిఫ్ట్‌ల వారీగా సిబ్బంది నియామకం ఉండనుంది. ఒక్కో షిప్ట్ లో 900 మంది సిబ్బంది పాల్గొననున్నారు.
TG News: కమల వికాసం.. కాంగ్రెస్ దరహాసం..
Read more Telangana News and Telugu News