Dengue: డెంగీతో తొమ్మిదేళ్ల బాలుడి మృతి
ABN , Publish Date - Aug 18 , 2024 | 03:45 AM
రంగారెడ్డి జిల్లాలో డెంగీతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో డెంగీ లక్షణాలతో మహిళ మృతి చెందింది.
డెంగీ లక్షణాలతో మరో మహిళ మృతి
శంకర్‌పల్లి, కోనరావుపేట, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : రంగారెడ్డి జిల్లాలో డెంగీతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో డెంగీ లక్షణాలతో మహిళ మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం టంగటూరు గ్రామానికి చెందిన అబ్బగోని మహే్‌షగౌడ్, సంధ్యల కుమారుడు గౌతమ్‌గౌడ్(9) శంకర్‌పల్లిలోని నారాయణ ఉన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. ఐదు రోజుల క్రితం అతడికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా డెంగీ వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించి చికిత్స అందించారు.
అప్పటి నుంచి ఆరోగ్యం బాగానే ఉంది. శుక్రవారం సాయంత్రం మళ్లీ జ్వరం రావడంతో తల్లిదండ్రులు నగరంలోని నానక్‌రామ్‌గూడలో గల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన బడుగు ఇందిర(43) అనే మహిళ డెంగీ లక్షణాలతో శనివారం మృతి చెందారు. ఈమె వారం రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. శుక్రవారం జ్వరం ఎక్కువ కావడంతో వేములవాడలోని ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి రక్తహీనత ఉందని,, రక్త కణాలు తగ్గాయని కరీంనగర్‌కు పంపించారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న సమయంలోనే శ్వాస ఆడక మృతి చెందింది.