Share News

అగ్రిగోల్డ్‌ ముసుగులో 130కిపైగా కంపెనీలు

ABN , Publish Date - Nov 08 , 2024 | 04:04 AM

అగ్రిగోల్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నాంపల్లి ఎంఎ్‌సజే ప్రత్యేక కోర్టులో అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

అగ్రిగోల్డ్‌ ముసుగులో 130కిపైగా కంపెనీలు

  • 32 లక్షల మంది నుంచి రూ.6,380 కోట్లు సేకరణ

  • నాంపల్లి కోర్టులో ఈడీ అనుబంధ చార్జిషీట్‌

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నాంపల్లి ఎంఎ్‌సజే ప్రత్యేక కోర్టులో అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అగ్రిగోల్డ్‌ ముసుగులో 130కన్నా ఎక్కువ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆకర్షణీయమైన పథకాల పేరుతో 32 లక్షలకన్నా ఎక్కువ మంది పెట్టుబడిదారుల నుంచి రూ. 6380 కోట్లు సేకరించినట్లు తేలింది. తాజాగా అగ్రిగోల్డ్‌ ఎగ్జిమ్స్‌, అమృతవర్షిణి డైరీ ఫామ్స్‌ కేసుల్లో అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇన్ఫోటెక్‌, మాతాంగి ఇన్‌ఫ్రా వెంచర్స్‌, శక్తి టింబర్‌ ఎస్టేట్స్‌, అవ్వా సీతారామారావు, అవ్వా వెంకట సుబ్రహ్మణ్వేశ్వర శర్మ, శాంక్చురీ హోమ్స్‌లపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. అగ్రిగోల్డ్‌ గ్రూప్‌ కంపెనీలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఒడిశా, అండమాన్‌ సహా పలు రాష్ట్రాల్లో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

Updated Date - Nov 08 , 2024 | 04:04 AM