2025 Holidays: వచ్చే ఏడాది 27 సాధారణ సెలవులు..
ABN , Publish Date - Nov 10 , 2024 | 02:18 AM
వచ్చే జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న 2025 సంవత్సరంలో సాధారణ సెలవులు(జనరల్ హాలిడేస్), ఐచ్ఛిక సెలవుల(ఆప్షనల్ హాలిడే్‌స)ను ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని తెలిపింది.
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): వచ్చే జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న 2025 సంవత్సరంలో సాధారణ సెలవులు(జనరల్ హాలిడేస్), ఐచ్ఛిక సెలవుల(ఆప్షనల్ హాలిడే్‌స)ను ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని తెలిపింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. సాధారణ సెలవు దినాల్లో ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూసి ఉంటాయని ప్రకటించింది. ఆదివారం, రెండో శనివారం కూడా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినాలని తెలిపింది.
అయితే... ఫిబ్రవరి 8న వచ్చే రెండో శనివారం మాత్రం పని దినం(వర్కింగ్ డే)గా ప్రకటించింది. దానికి బదులుగా జనవరి 1న(బుధవారం) ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సాధారణ సెలవు ఉంటుందని వెల్లడించింది. 23 ఐచ్ఛిక సెలవుల్లో ఉద్యోగులు ఏవైనా ఐదింటిని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ సెలవు దినాలు పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజా పనుల విభాగంలో పని చేసే కార్మికులకు వర్తించబోవని తెలిపింది. కముస్లింలు జరుపుకొనే పర్వదినాల తేదీల్లో చంద్రుడు దర్శనమిచ్చే దానినిబట్టి మార్పులు ఉంటాయని తెలిపింది.
సాధారణ సెలవులు
ఆంగ్ల కొత్త సంవత్సరం జనవరి 1 బుధవారం
భోగి జనవరి 13 సోమవారం
సంక్రాంతి/పొంగల్ జనవరి 14 మంగళవారం
గణతంత్ర దినోత్సవం జనవరి 26 ఆదివారం
మహా శివరాత్రి ఫిబ్రవరి 26 బుధవారం
హోలి మార్చి 14 శుక్రవారం
ఉగాది మార్చి 30 ఆదివారం
రంజాన్ మార్చి 31 సోమవారం
రంజాన్ తర్వాతి దినం ఏప్రిల్ 1 మంగళవారం
జగ్జీవన్‌రామ్ జయంతి ఏప్రిల్ 5 శనివారం
శ్రీరామ నవమి ఏప్రిల్ 6 ఆదివారం
అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 14 సోమవారం
గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 18 శుక్రవారం
బక్రీద్ జూన్ 7 శనివారం
మొహరం జూలై 6 ఆదివారం
బోనాలు జూలై 21 సోమవారం
స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 శుక్రవారం
శ్రీ కృష్ణాష్టమి ఆగస్టు 16 శనివారం
వినాయక చవితి ఆగస్టు 27 బుధవారం
మిలాద్ ఉన్ నబి సెప్టెంబరు 5 శుక్రవారం
బతుకమ్మ ప్రారంభం సెప్టెంబరు 21 ఆదివారం
గాంధీ జయంతి/దసరా అక్టోబరు 2 గురువారం
దసరా తర్వాతి రోజు అక్టోబరు 3 శుక్రవారం
దీపావళి అక్టోబరు 20 సోమవారం
గురునానక్ జయంతి నవంబరు 5 బుధవారం
క్రిస్మస్ డిసెంబరు 25 గురువారం
క్రిస్మస్ తర్వాతి రోజు డిసెంబరు 26 శుక్రవారం