Hyderabad: రోడ్డుపై వరినాట్లతో కౌన్సిలర్ నిరసన..
ABN , Publish Date - Jul 21 , 2024 | 10:27 AM
గుంతల మయంగా మారిన భౌరంపేట ప్రధాన రహదారికి మరమ్మతులు చేయడంలో అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు(Officers, MLAs, MLCs) విఫలమయ్యారని ఆరోపిస్తూ శనివారం స్థానిక కౌన్సిలర్ బాలమణికృష్ణారెడ్డి(Councilor Balamanikrishna Reddy) స్థానిక మహిళలతో వచ్చి రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు.
హైదరాబాద్: గుంతల మయంగా మారిన భౌరంపేట ప్రధాన రహదారికి మరమ్మతులు చేయడంలో అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు(Officers, MLAs, MLCs) విఫలమయ్యారని ఆరోపిస్తూ శనివారం స్థానిక కౌన్సిలర్ బాలమణికృష్ణారెడ్డి(Councilor Balamanikrishna Reddy) స్థానిక మహిళలతో వచ్చి రోడ్డుపై నాట్లు వేసి నిరసన తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తవ్విన రోడ్డుకు మరమ్మతులు చేయకుండా వదిలివేశారని అన్నారు.
ప్రస్తుత వర్షాలతో గుంతల్లో నీరు నిండడంతో వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయాలపాలవుతున్నారని తెలిపారు. ప్రజా సమస్యలు పట్టించుకోని నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్‌కు మద్దతుగా గ్రామస్థులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News