Hyderabad: రామంతాపూర్‌లో నకిలీ వైద్యుల గుట్టు రట్టు
ABN , Publish Date - Dec 03 , 2024 | 10:06 AM
ఎటువంటి అర్హత లేకున్నా వైద్య చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల(Fake doctors) గుట్టు రట్టు చేశారు. వైద్యమండలికి అందిన ఫిర్యాదుల మేరకు సోమవారం తెలంగాణ వైద్య మండలి సభ్యులు డాక్టర్ నరేష్కుమార్, డాక్టర్ ప్రతిభలక్ష్మీ, డాక్టర్ వంశీ కృష్ణ రామంతాపూర్‌లోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్: ఎటువంటి అర్హత లేకున్నా వైద్య చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యుల(Fake doctors) గుట్టు రట్టు చేశారు. వైద్యమండలికి అందిన ఫిర్యాదుల మేరకు సోమవారం తెలంగాణ వైద్య మండలి సభ్యులు డాక్టర్ నరేష్కుమార్, డాక్టర్ ప్రతిభలక్ష్మీ, డాక్టర్ వంశీ కృష్ణ రామంతాపూర్‌లోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. రామంతాపూర్ నెహ్రూనగర్(Ramanthapur Nehrunagar)లో సురేష్ అనే వ్యక్తి డాక్టర్ నర్సింహాచారి పేరిట ఎస్‌వీఎల్ క్లినిక్ పేరుతో రోగులకు చికిత్స చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అనుమానాస్పదస్థితిలో గృహిణి మృతి
నర్సింహాచారికి నోటీసులు జారీ చేయడం తోపాటు నకిలీ వైద్యుడు సురేష్‌పై కేసు నమోదు చేశారు. ఇదే ప్రాంతంలో బాలాజీ ఫస్ట్ ఎయిడ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్న తురుగ నాగేశ్వర్‌రావు, రాంరెడ్డినగర్‌లో నకిలీ వైద్యం చేస్తున్న ఉష్ణోదయ ఫస్ట్ ఎయిడ్ కేంద్రం నిర్వాహకుడు యాదగిరిలపై కేసులను నమోదు చేయనున్నట్లు వారు తెలిపారు. ప్రజలు నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నకిలీ వైద్యులకు సంబంధించిన సమాచారాన్ని వైద్య మండలికి, ఆరోగ్య శాఖ అధికారులకు తెలపాలని వారు సూచించారు.
ఈవార్తను కూడా చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..
ఈవార్తను కూడా చదవండి: నాలుగు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన ఓ విద్యార్థి.. చివరకు
ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
ఈవార్తను కూడా చదవండి: ఎస్ఐ సూసైడ్ వ్యవహారంలో సంచలన విషయాలు
Read Latest Telangana News and National News