Hyderabad: నిలోఫర్‌లో ఆధునిక ఐసీయూ.. ప్రారంభించిన మంత్రి సీతక్క
ABN , Publish Date - Mar 08 , 2024 | 10:41 AM
ప్రాణదానం చేసే దేవాలయం లాంటి నిలోఫర్ ఆస్పత్రికి సహకారం అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయం అని మంత్రి అనసూయ(సీతక్క) అన్నారు.
హైదరాబాద్: ప్రాణదానం చేసే దేవాలయం లాంటి నిలోఫర్ ఆస్పత్రికి సహకారం అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయం అని మంత్రి అనసూయ(సీతక్క) అన్నారు. నిలోఫర్‌లో నవజాత శిశువుల చికిత్స కోసం ఆధునికీకరించిన ఐసీయూను సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ. 50 లక్షలు వెచ్చించి ఐసీయూ ఆధునికీకరణకు సహకరించిన రోటరీక్లబ్‌ను అభినందించారు. కరోనా కాలంలో రోటరీక్లబ్ సేవలను తమ ఏజెన్సీ ప్రాంతప్రజల అవసరాల కోసం ఉపయోగించుకున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, వైద్యులు వాణి, జ్యోతి రోటరీక్లబ్ మావెరిక్స్ అధ్యక్షురాలు వనశ్రీ, కార్యదర్శి దేశిని లక్ష్మీనారాయణ, రోటరీ గ్లోబల్ విజార్డ్ శ్రీవర్దన్, ప్రతినిధులు పాల్గొన్నారు.