Share News

Hyderabad: చంచల్‌గూడ జైలులో ఖైదీల నిరాహారదీక్ష

ABN , Publish Date - Aug 28 , 2024 | 09:31 AM

చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)లో రాజకీయ ఖైదీల హక్కులను జైలు అధికారులు హరించి వేస్తున్నారని, వారికి న్యాయం చేయాలని సీడీఆర్‌ఓ (కోఆర్డినేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రైట్స్‌) కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గుంటి రవి డిమాండ్‌ చేశారు.

Hyderabad: చంచల్‌గూడ జైలులో ఖైదీల నిరాహారదీక్ష

  • ఖైదీల హక్కులను గౌరవించాలని ప్రొఫెసర్‌ గుంటి రవి డిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ: చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)లో రాజకీయ ఖైదీల హక్కులను జైలు అధికారులు హరించి వేస్తున్నారని, వారికి న్యాయం చేయాలని సీడీఆర్‌ఓ (కోఆర్డినేషన్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రైట్స్‌) కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గుంటి రవి డిమాండ్‌ చేశారు. చంచల్‌గూడ సెంట్రల్‌ జైలులో ఉన్న రాజకీయ(మావోయిస్టు) ఖైదీలు అమితాబ్‌ బాగ్చీ, గంగాధర్‌రావు, రాజ్‌కుమార్‌ పట్ల జైలు అధికారులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని, వారి హక్కులను హరిస్తున్నారని ఆరోపించారు.

ఇదికూడా చదవండి: Kavitha: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకానున్న కవిత


జైలు అధికారులు వారిని నర్మదాబారక్‌(Narmada Barrack)లో ఏకాంతంగా నిర్భందించారని, వారిని కనీసం ఉదయం కూడా బయటకు రానివ్వడం లేదని తెలిపారు. సుప్రీం కోర్టు కూడా వివిధ తీర్పుల్లో దీన్ని తప్పుబట్టిందన్నారు. వీరిని గదుల్లో నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ ఇతర ఖైదీలు నిరాహార దీక్ష ప్రారంభించారని తెలిపారు. జైలు అధికారులు ఖైదీలతో న్యాయబద్ధంగా వ్యవహరించాలని, వారి హక్కులను గౌరవించి, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.


........................................................................

ఈ వార్తను కూడా చదవండి:

..........................................................................

Hyderabad: ఆర్టీసీ సిబ్బంది జంగ్‌సైరన్‌..

- రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌(Congress) విస్మరించిందని ఆర్టీసీ జేఏసీ(RTC JAC) నేతలు విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతున్నా, ఇంకా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు(black badges) ధరించి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, రెండు వేతన సవరణలను అమలు చేస్తామని, సంస్థను విస్తరిస్తామని, యూనియన్‌ కార్యకలాపాలను పునరిద్ధరిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని, ఇప్పుడు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

city1.jpg


city1.2.jpg

కార్మికుల చేత 16 గంటలు పనిచేయిస్తూ ఆర్టీసీ యాజమాన్యం చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు. పదేళ్లలో 13 వేల మంది కార్మికులు వివిధ కారణాల వల్ల వైదొలగినా వారిస్థానంలో కొత్తగా ఒక్కరిని కూడా నియమించలేదన్నారు. ప్రస్తుతానికి శాంతియుత పద్ధతుల్లో పనికి ఆటంకం కలగని రీతిలో ఆందోళన చేస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 28 , 2024 | 09:31 AM