Share News

Hyderabad: మేమున్నామని.. మీకేం కాదని

ABN , Publish Date - Oct 24 , 2024 | 10:29 AM

అడ్డగుట్ట డివిజన్‌లోని మొండిబండనగర్‌(Mondibandanagar) బస్తీలో పేదలు దాదాపు 45 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారు. రెండు రోజుల క్రితం రైల్వే అధికారులు గుడిసెవాసుల వద్దకు వచ్చి ఇది రైల్వే స్థలమని మీరు వారం లోగా ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు.

Hyderabad: మేమున్నామని.. మీకేం కాదని

- మొండిబండనగర్‌ బస్తీవాసులకు కాంగ్రెస్‌ నేతల భరోసా

- రైల్వే అధికారుల నోటీసులకు ఆందోళనలో స్థానికులు

హైదరాబాద్: అడ్డగుట్ట డివిజన్‌లోని మొండిబండనగర్‌(Mondibandanagar) బస్తీలో పేదలు దాదాపు 45 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారు. రెండు రోజుల క్రితం రైల్వే అధికారులు గుడిసెవాసుల వద్దకు వచ్చి ఇది రైల్వే స్థలమని మీరు వారం లోగా ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారు. దాంతో బిక్కుబిక్కుమం టూ వారు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు రామలీల, భూపతి హరితో పాటు పలువురు నాయకులు బుధవారం మొండిబండనగర్‌ బస్తీలో పర్యటించి గుడిసె వాసుల నుంచి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP: మూసీ సుందరీకరణ పేరుతో.. పేదల ఇళ్లను కూల్చితే ఊరుకోం..


ఆర్‌ఆర్‌సీ మైదానాన్ని ఆనుకుని ఉన్న 50 కుటుంబాలు 45 ఏళ్ల క్రితం గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారని, అందరికి ఈ స్థలంపైనే ఆధార్‌, ఓటర్‌ కార్డులు ఉన్నా, గుడిసెలు ఖాళీ చేయమంటున్నారని తెలి పారు. ఎవరూ భయపడవద్దని సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ కంటెస్టెడ్‌ ఎమ్మెల్యే ఆదం సంతోష్‌ కుమార్‌ చూసుకుంటాడని కాంగ్రెస్‌ నేతలు ధైర్యం చెప్పారు. బలవంతంగా రైల్వే అధికారులు ఖాళీ చేయించాలని చూస్తే మారేడుపల్లి తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న డబుల్‌ బెడ్‌రూంలను ఇప్పిస్తామని గుడిసెవాసులకు ధైర్యం చెప్పారు.

city6.jpg


భయంతో పనికి పోవడంలేదు - కాంగ్రెస్‌ నాయకులు

మెండిబండ నగర్‌ బస్తీలో దాదాపు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో కొంత మందికి డబుల్‌ బెడ్‌రూంలు వచ్చినప్పటికి అక్కడ సదుపాయాలు లేవు. దీంతో కొందరు బయట అద్దెకు ఉంటున్నారు. వారం రోజుల్లో గుడిసెలు ఖాళీ చేయాలని రైల్వే అధికారులు చెబుతున్నారని, వీళ్లంతా పనికి వెళితే ఎప్పుడు వచ్చి కూల్చివేస్తారోనన్న భయంతోనే గుడిసెవద్దే ఉంటున్నారు.


కార్పొరేటర్‌కు చెబితే పట్టించుకోలేదు - గుడిసెవాసులు

గత 45 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నామని, ప్రతి సారీ రైల్వే అధికారులు వచ్చి గుడిసెలు ఖాళీ చేయాలని బెదిరించారు. ఇదే విషయంపై సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే పద్మారావు, అడ్డగుట్ట డివిజన్‌ కార్పొరేటర్‌ ప్రసన్నలక్ష్మికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. మా సమస్యలన్ని వారు పట్టించుకోలేదు. చూస్తాం చేస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నాం: మంత్రి పొంగులేటి

ఇదికూడా చదవండి: తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలనూ తిరుమలలో అనుమతించాలి

ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

ఇదికూడా చదవండి: Bandi Sanjay: భయపెట్టాలని చూస్తే భయపడతామా?

Read Latest Telangana News and National News

Updated Date - Oct 24 , 2024 | 10:29 AM