Share News

CMRF Applications: నేటి నుంచి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు..

ABN , Publish Date - Jul 15 , 2024 | 11:41 AM

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టి, అర్హులకు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) దరఖాస్తులను సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరించనుంది. ఈమేరకు స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు లాగిన్ ఐడీని కేటాయించింది.

CMRF Applications: నేటి నుంచి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు..

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం (Congress Govt.) కీలక నిర్ణయం (Key Decision) తీసుకుంది. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టి, అర్హులకు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) దరఖాస్తులను సోమవారం నుంచి ఆన్‌లైన్‌ (Online)లో స్వీకరించనుంది. ఈమేరకు స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు లాగిన్ ఐడీని కేటాయించింది. వారి వద్దకు వెళ్తే పేషెంట్ల వివరాలను సీఎంఆర్ఎఫ్ ఆన్‌లైన్ పోర్టల్లో నమోదు చేస్తారు. బాధితులు సమర్పించిన సర్టిఫికెట్లు సరైనవా? కాదా? అనే వివరాలు తెలుసుకునేందుకు పోర్టల్లో ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేశారు.


సీఎంఆర్‌ఎఫ్‌ అమలును పారదర్శకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)నిర్ణయించారు. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (Center for Good Governance) ఆధ్వర్యంలో వెబ్‌సైట్‌ (Website)ను రూపొందించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్‌ఎఫ్ నిధుల మళ్లింపు నేపథ్యంలో ఈ విధానాన్ని రూపొందించారు. ఇక నుంచి ముఖ్యమంత్రి సహాయనిధి దరఖాస్తులను ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు సీఎంఆర్‌ఎఫ్ కోసం తమ వద్దకు వచ్చే వారి వివరాలను తీసుకుని వారి సిఫార్సు లేఖను అప్‌లోడ్ చేస్తారు. దరఖాస్తులో సంబంధిత దరఖాస్తుదారు బ్యాంకు ఖాతా నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టం చేశారు.


అప్లికేషన్‌ను అప్‌లోడ్ చేసిన తర్వాత CMRFకి సంబంధించిన కోడ్ (Code) ఇవ్వబడుతుంది. ఆ కోడ్ ఆధారంగా ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. నిర్ధారణ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు సంబంధిత ఆసుపత్రులకు పంపబడుతుంది. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, CMRF దరఖాస్తు ఆమోదించి లబ్దిదారునికి చెక్కు సిద్ధం చేయబడుతుంది. దరఖాస్తుదారు ఖాతా సంఖ్య చెక్కుపై ముద్రించబడుతుంది. దీంతో చెక్ పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు స్వయంగా దరఖాస్తుదారులకు చెక్కులను అందజేస్తారు. ఈ లింక్‌ ద్వారా దరఖాస్తును పూర్తి చేయాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీమా పేరుతో రైతన్నలకు జగన్‌ దగా..

పూరీ జగన్నాథ్ ఆలయంలో టెన్షన్..

దొంగలెక్కలు రాయడంలో ఆయన దిట్ట..

ఏపీ గనుల అక్రమాలపై శ్వేతపత్రం..

మహారాష్ట్ర సీఎంతో చంద్రబాబు కీలక భేటీ..

సర్వం స్వాహా!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 15 , 2024 | 11:59 AM