Bhatti: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై భట్టి సమీక్ష.. ఏం చెప్పారంటే
ABN , Publish Date - Nov 09 , 2024 | 11:55 AM
Telangana: హౌస్ లిస్టింగ్ పూర్తి చేసి ఈరోజు (శనివారం) నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఎన్యుమరేటర్లతో కలెక్టర్లు విస్తృతంగా మాట్లాడాలని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలన్నారు. దేశం మొత్తం తెలంగాణను గమనిస్తోందని.. ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయన్నారు.
హైదరాబాద్, నవంబర్ 9: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) సమీక్ష సమావేశం నిర్వహించారు. శనివారం ఉదయం జిల్లా కలెక్టర్లు, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ఇతర శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై సమీక్ష జరిపారు. సర్వేకు సంబంధించి అధికారులకు డిప్యూటీ సీఎం పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.
Street Food: జనాలను భయపెట్టేలా స్ట్రీట్ ఫుడ్స్.. ఏం జరిగిందంటే
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హౌస్ లిస్టింగ్ పూర్తి చేసి ఈరోజు నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేస్తున్నామన్నారు. ఎన్యుమరేటర్లతో కలెక్టర్లు విస్తృతంగా మాట్లాడాలని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలన్నారు. దేశం మొత్తం తెలంగాణను గమనిస్తోందని.. ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయన్నారు. ఎన్యుమరేటర్లతో కలెక్టర్లు ఎప్పటికప్పుడు మాట్లాడితే ప్రజల సందేహాలు వెంటనే తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రజల సందేహాలను కలెక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని.. వెంటనే వాటిని నివృత్తి చేయాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలను సర్వేలో భాగస్వాములు అయ్యేలా చూడాలన్నారు. ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే గొప్పగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. సర్వేపై కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలోని అధికారులు విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో చీఫ్ సెక్రటరీ శాంత కుమారి, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కులగణన..
కాగా.. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కులగణన ఈనెల 6 నుంచి ప్రారంభమైంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను సర్వేలో భాగంగా ఇన్యుమరేటర్లు సేకరిస్తారు. అయితే మొదటి రెండు రోజులు కూడా అధికారులు, సిబ్బంది ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంతికించి సమగ్ర కుటుంబ సర్వే గురించి ప్రజలకు వివరిస్తారు. ఆ తర్వాత నేటి (నవంబర్ 9) పూర్తి స్థాయిలో సమగ్ర సర్వేను మొదలుపెట్టనున్నారు. సర్వేలో మొత్తం 75 ప్రశ్నలతో కుటుంబ సమాచారం సేకరణ ఉంటుంది. అందులో 56 ప్రధాన ప్రశ్నలు కాగా.. మరో 19 అనుబంధ ప్రశ్నలు ఉంటాయి.
రెండు పార్టులుగా పార్టు-1, పార్టు-2గా ఎనిమిది పేజీల్లో సర్వే పత్రాలను సిద్ధం చేశారు. పార్టు-1లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉంటాయి. సర్వేలో సాధారణ, విద్య, ఉద్యోగ, ఉపాధి, భూములు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, రాజకీయ, కుల సమాచారం సేకరణ ఉంటుంది. పార్టు-2లో కుటుంబ వివరాలను సేకరిస్తారు. ఇందులో మొత్తం 17 ప్రశ్నల్లో ఏడు ప్రధాన ప్రశ్నలు ఉండగా, మిగిలినవి అనుబంధ ప్రశ్నలు ఉండనున్నాయి. సర్వే సందర్భంగా ఫొటోలు తీయడం - పత్రాలు తీసుకోవడం లాంటివి ఉండవు. కుటుంబం మొత్తం ఉండాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 8 వరకు సర్వే పూర్తి అవనుంది. డిసెంబర్ 9న ప్రభుత్వానికి రిపోర్ట్ అందజేస్తారు. అలాగే కుటుంబ సర్వే కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సర్వే కోసం 80 వేల మంది ఇన్యుమరేటర్లు, 18 వేల మంది సూపర్ వైజర్లకు శిక్షణ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సర్వే కోసం 18,723 మంది ఇన్యుమరేటర్లు, 1870 మంది సూపర్‌వైజర్లను ప్రభుత్వం నియమించింది.
ఇవి కూడా చదవండి..
Trump Tower: హైదరాబాద్‌లో ట్రంప్ టవర్లు
Read Latest Telangana News And Telugu News