Share News

ED Raids: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. అసలు కారణం అదే..!

ABN , Publish Date - Jun 20 , 2024 | 10:17 AM

తెలంగాణలో ఈడీ సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఎన్నికల ముందు వరకు ఐటీ, ఈడీ సోదాలతో తెలంగాణ రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా ఈడీ సోదాలతో తెలంగాణ రాజకీయం ఆసక్తిరేపుతోంది.

ED Raids: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు.. అసలు కారణం అదే..!
Gudem Mahipal and Madhu

తెలంగాణలో ఈడీ సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఎన్నికల ముందు వరకు ఐటీ, ఈడీ సోదాలతో తెలంగాణ రాజకీయం వేడెక్కిన విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తైన తర్వాత కూడా ఈడీ సోదాలతో తెలంగాణ రాజకీయం ఆసక్తిరేపుతోంది. పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున ఈడీ అధికారులు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఆయన సోదరుడు గూడెం మధుసూదన్‌ రెడ్డి ఇంట్లో కూడా ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. గూడెం మహిపాల్ రెడ్డి సోదరులు ఇద్దరు మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఓ కేసులో మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధు అరెస్ట్‌ కాగా ప్రస్తుతం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.

Khammam: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై త్వరలో ఒక పాలసీ..


నిజాంపేటలో..

హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి అల్లుడి ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. గతంలో లక్డారం గనుల వ్యవహారంలో వీరిపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సోదాల సమయంలో గూడెం మహిపాల్ రెడ్డి సోదరుల ఇళ్ల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటుచేశారు. మరోవైపు మహిపాల్ రెడ్డి ఇంటికి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. వారిని అదుపు చేసేందుకు కేంద్రబలగాలతో భద్రత ఏర్పాటుచేశారు. ఇదిలా ఉండగా మహిపాల్ రెడ్డి అల్లుడు తాజాగా రూ.3కోట్ల ఖరీదైన విలాసవంతమైన కారు కొన్నట్లు సమాచారం.


NDA Government: వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Jun 20 , 2024 | 10:17 AM