KTR: రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా.. కాంగ్రెస్ తల్లినా
ABN , Publish Date - Dec 06 , 2024 | 02:22 PM
Telangana: రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా? కాంగ్రెస్ తల్లినా? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘ఆహ్వానం మాకు మ్యాటర్ కాదు.. తెలంగాణ తల్లి మాకు మ్యాటర్’’ అని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కార్యక్రమం కాదన్నారు. లగచర్ల, గురుకులాలు, వ్యవసాయ సంక్షోభవం, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తామని తెలిపారు. అసెంబ్లీ, మండలి సమావేశాలు కనీసం నెల రోజులు నడపాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 6: బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్థంతి కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) పాల్గొని.. అంబేద్కర్‌కు నివాళులర్పించారు. . ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై శాసనసభలో రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా? కాంగ్రెస్ తల్లినా? అని ప్రశ్నించారు. ‘‘ఆహ్వానం మాకు మ్యాటర్ కాదు.. తెలంగాణ తల్లి మాకు మ్యాటర్’’ అని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కార్యక్రమం కాదన్నారు. లగచర్ల, గురుకులాలు, వ్యవసాయ సంక్షోభవం, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తామని తెలిపారు.
Viral: అద్భుతం.. గంగానది నీటిని మైక్రోస్కోప్‌లో చూస్తే..
అసెంబ్లీ, మండలి సమావేశాలు కనీసం నెల రోజులు నడపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వాలు మారినపుడల్లా గత ప్రభుత్వం నిర్ణయాలు మారాలా అని నిలదీశారు. ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన భారతమాత రూపాన్ని వాజపేయి మార్చలేదన్నారు. నాలుగేళ్ళ తర్వాత రాజీవ్ రాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి నోటికి హద్దు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్ ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నారన్నారు. రేవంత్ చెప్తే.. కేసీఆర్ నేర్చుకోవాల్సిన పరిస్థితిలో లేరన్నారు. మర్యాద.. రేవంత్ అడ్టుకుంటే రాదని.. ఇచ్చుపుచ్చుకోవాలని హితవుపలికారు.
కేసీఆర్‌ను గౌరవిస్తేనే.. రేవంత్ రెడ్డిని, ఆయన కుర్చీని గౌరవిస్తామన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రేవంత్ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. హైకమాండ్ నుంచి వచ్చిన డైరెక్షన్‌తోనే అంబేద్కర్, పీవీ విగ్రహాలను రేవంత్ పట్టించుకోవటం లేదని విమర్శించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం సందర్శనకు అవకాశం ఉందన్నారు. 125అడుగుల విగ్రహాం సందర్శనకు అవకాశం ఇవ్వకుండా.. తాళాలు వేసి అపరిశుభ్రంగా తయారుచేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతామంటే పోలీసులతో అడ్డుకుంటున్నారన్నారు.‘‘గురుకుల విద్యార్థులను మేను ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిస్తే.. రేవంత్ పాడెను ఎక్కిస్తున్నారు’’ అంటూ విమర్శించారు. యూపీలో తిరగనివ్వటం లేదని మొత్తుకుంటోన్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జన్సీనే నడుస్తోంది అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
నాడు తిట్లు.. నేడు ప్రశంసలు.. పవన్‌పై వైసీపీ ఎంపీ లవ్
దళితుల మీద కక్షా.. లేక
అలాగే ఎక్స్ వేదికగా కూడా తెలంగాణ ప్రభుత్వం, రాహుల్ గాంధీపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని తిరుగుతారని.. ఆ రాజ్యాంగం రచించిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని కేసీఆర్ గౌరవంగా తెలంగాణ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన సగౌరవంగా ప్రతిష్టించారని తెలిపారు. అదే రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన సీఎం రేవంత్ కనీసం మహనీయుడు అంబేద్కర్ జయంతి, వర్ధంతులకు కనీసం దండేసి, దండంపెట్టి స్మరించుకునే అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు.
‘‘కేసీఆర్ కట్టిన సచివాలయంలో సమీక్షలు చేస్తూ ! కేసీఆర్ కట్టిన పోలీస్ కంట్రోల్ రూమ్‌లో సమీక్షలు చేస్తూ ! కేసీఆర్ కట్టిన ప్లై ఓవర్లను ప్రారంభిస్తూ ! కేసీఆర్ కట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రారంభిస్తూ ! కేసీఆర్ ప్రతిష్టించిన అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించకుండా నిర్భంధిస్తారా ? ఇది దళితుల మీద కక్ష్యా ? మహనీయులు అంబేద్కర్ గారి మీద వివక్షా ? జాగో తెలంగాణ జాగో’’ అంటూ ఎక్స్‌లో కేటీఆర్ పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి..
భవిష్యత్తులో ఆ దేశం అంతరించిపోతుంది.. ఎలాన్ మస్క్ హెచ్చరిక
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు..
Read Latest Telangana News And Telugu News