Share News

Delhi Liquor Case: ముగిసిన కవిత సీబీఐ కస్టడీ.. నేడు కోర్టు ముందుకు..

ABN , Publish Date - Apr 15 , 2024 | 07:23 AM

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ కస్టడీ ముగిసింది. దీంతో సోమవారం ఆమెను అధికారులు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కవితను విచారించింది. విచారణ ముగియడంతో అధికారులు ఇవాళ కవితను కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

Delhi Liquor Case: ముగిసిన కవిత సీబీఐ కస్టడీ.. నేడు కోర్టు ముందుకు..

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) సీబీఐ కస్టడీ (CBI Custody) ముగిసింది. దీంతో సోమవారం ఆమెను అధికారులు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు (Rouse Avenue CBI Special Court) ముందు హాజరుపరచనున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కవితను విచారించింది. విచారణ ముగియడంతో అధికారులు ఇవాళ కవితను కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.


నేడు కోర్టు ముందుకు కవిత

కవిత సీబీఐ కస్టడీ ఆదివారం సాయంత్రంతో ముగిసింది. దీంతో సోమవారం ఉదయం 10 గంటలకు కవితను రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు. 3 రోజుల కస్టడీలో కవిత వెల్లడించిన పలు అంశాలను సీబీఐ కోర్టుకు చెప్పే అవకాశం ఉంది. విచారణకు కవిత సహకరించలేదని సీబీఐ భావిస్తే.. మరో 3-5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయమూర్తిని కోరే అవకాశం ఉంది. గతంలో ఈడీ కూడా కవితను రెండు సార్లు కస్టడీలోకి తీసుకుని విచారించింది. ఇప్పుడు సీబీఐ కూడా మరోసారి కస్టడీకి తీసుకుంటుందా? లేదా అనేది ఉత్కంఠగా మారింది. సీబీఐ కస్టడీకి కోర్టు అంగీకరిస్తే కవితను మళ్లీ సీబీఐ హెడ్‌ ఆఫీసుకు తరలించనున్నారు.


కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై సీబీఐ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె సోదరుడు కేటీఆర్‌ కలిశారు. కవిత భర్త అనిల్‌, న్యాయవాది మోహిత్‌ రావు, వ్యక్తిగత సహాయకుడు శరత్‌తో కలిసి ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్‌.. కవితతో ములాఖత్‌ అయ్యారు. ఆదివారం సాయం త్రం 5:45 గంటలకు సీబీఐ కార్యాలయంలోకి వెళ్లిన కేటీఆర్‌.. 7:40 గంటలకు బయటకు వచ్చారు. అయితే, కవితతో 35 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగినట్లు తెలిసింది. సీబీఐ కస్టడీలో వసతులు, విచారణ తీరు, ఏయే అంశాలపై విచారణ నడుస్తున్నది, తిహాడ్‌ జైలులో పరిస్థితి, సీబీఐ అరెస్టు సమాచారం ఎప్పుడు తెలిసింది? కేసు విచారణలో ఈడీ, సీబీఐ వ్యవహరిస్తున్న తీరు, బెయిల్‌ పిటిషన్‌ తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. బెయిల్‌ వస్తుందని, ధైర్యంగా ఉండాలని కవితకు కేటీఆర్‌ ధైర్యం చెప్పినట్టు తెలిసింది. వాస్తవానికి శనివారమే కేటీఆర్‌ ఢిల్లీకి వచ్చి, తిహాడ్‌ జైలులో కవితను కలవాల్సి ఉంది. అయితే, కవితను సీబీఐ అరెస్టు చేయడం, కస్టడీలోకి తీసుకోవడంతో కేటీఆర్‌ షెడ్యూల్‌లో మార్పు జరిగింది. ఒకరోజు ఆలస్యంగా ఆదివారం ఆయన కవితను కలిశారు.

Updated Date - Apr 15 , 2024 | 07:28 AM