Share News

Chiranjeevi: ఏ టైమ్‌కు ఏది రావాలంటే అది వస్తది..నేను ఎదురు చూడను: చిరంజీవి

ABN , Publish Date - May 10 , 2024 | 02:07 PM

హైదరాబాద్: 45 సంవత్సరాల సుదీర్ఘ సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డ్ ఇచ్చిందని, తన కృషి , సేవతో పాటు తన అభిమానులు, ప్రేక్షకులు, దర్శక నిర్మాతలు టెక్నిషియన్స్‌కు మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.

Chiranjeevi: ఏ టైమ్‌కు ఏది రావాలంటే అది వస్తది..నేను ఎదురు చూడను: చిరంజీవి

హైదరాబాద్: 45 సంవత్సరాల సుదీర్ఘ సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డ్ (Padma Vibhushan Award) ఇచ్చిందని, తన కృషి , సేవతో పాటు తన అభిమానులు, ప్రేక్షకులు, దర్శక నిర్మాతలు టెక్నిషియన్స్‌కు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పద్మవిభూషణ్ అవార్డు వెనుక తన ఉన్నతికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. ఏ టైమ్‌కు ఏది రావాలంటే అది వస్తుందని.. తాను ఎదురు చూడనని అన్నారు.


నందమూరి తారక రామారావు (NTR)కు భారతరత్న అవార్డు (Bharat Ratna Award) రావాలని కోరుకుంటున్నానని, ఆయనకు ఇవ్వటం సముచితమని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఎంజీఆర్‌ (MGR)కు వచ్చినపుడు, ఎన్టీఆర్‌కు రావాలని అన్నారు. తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని.. ఏ పార్టీలో లేనని స్పష్టం చేశారు. తాను పిఠాపురం (Pithapuram) పర్యటనకు వెళ్లటం లేదని, పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)తో తాను ఉన్నానని చెప్పేందుకు వీడియో చేశానన్నారు. తమ కుటుంబం మద్దతు తమ్ముడు పవన్‌కు ఎప్పుడు ఉంటుందని చిరంజీవి స్పష్టం చేశారు.


కాగా మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) చేతుల మీదుగా అందుకున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సతీమణి సురేఖ (Surekha), కుమారుడు రామ్ చరణ్ (Ram Charan), కోడలు ఉపాసన (Upasana) పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు తర్వాత టాలీవుడ్‌లో ఈ అవార్డు అందుకున్న రెండవ నటుడు చిరంజీవి కావడం విశేషం.


ఈ వార్తలు కూడా చదవండి..

పాత బటన్ నొక్కుడుకు ఇప్పుడు డబ్బులు..

కాకినాడ సిటీలో పవన్ కళ్యాణ్ పర్యటనకు అధికారుల అడ్డంకులు..

సింహాచలం చందనోత్సవం స్వామి నిజరూప దర్శనం

సజ్జల భార్గవ్‌కు షాకిచ్చిన సీఐడీ!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 10 , 2024 | 02:12 PM