Share News

Seethakka: మా నోళ్లు కాదు.. నీ నోరే యాసిడ్‌తో కడగాలి.. కేటీఆర్‌పై సీతక్క ఫైర్

ABN , Publish Date - Oct 02 , 2024 | 04:05 PM

Telangana: తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మొదటి రోజే మహిళా మంత్రులను కించపరిచి కేటీఆర్ తన నైజాన్ని చాటుకున్నారు. ఎంగిలిపూల బతుకమ్మ రోజే కేటీఆర్ గలీజ్ మాటలు వినాల్సి రావటం దురదృష్టం...

Seethakka: మా నోళ్లు కాదు.. నీ నోరే యాసిడ్‌తో కడగాలి.. కేటీఆర్‌పై సీతక్క ఫైర్
Minister Seethakka

హైదరాబాద్, అక్టోబర్ 2: మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ మహిళా మంత్రులు ఒకరి తరువాత ఒకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్ల జీవితాలతో మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) చెలగాటమాడారు అంటూ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేయగా... తాజాగా మంత్రి సీతక్క (Minister Seethakka) కూడా మాజీ మంత్రిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మొదటి రోజే మహిళా మంత్రులను కించపరిచి కేటీఆర్ తన నైజాన్ని చాటుకున్నారన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ రోజే కేటీఆర్ గలీజ్ మాటలు వినాల్సి రావటం దురదృష్టమని వ్యాఖ్యలు చేశారు.

Viral Video: ఇది కదా పెంపకం అంటే.. స్కూల్‌‌కు వెళ్తూ దారి మధ్యలో ఈ విద్యార్థి చేసిన పని చూడండి..


‘‘మా నోళ్లను పినాయిల్‌తో కడగాలని మాట్లాడిన కుసంస్కారి కేటీఆర్. పండగల పూట మహిళ పట్ల చీప్ కామెంట్ చేసే కేటీఆర్ నోటినే యాసిడ్‌తో కడగాలి’’ అంటూ ధ్వజమెత్తారు. పండగల పూట మహిళలు, మహిళా మంత్రులను కించపరచడం కేటీఆర్‌కు ఫ్యాషన్ అయిపోయిందన్నారు. రాఖీ పండగ రోజు బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు చేసుకోవచ్చు అని అన్నారని.. ఇప్పుడు బతుకమ్మ పండుగ మొదటి రోజు చిట్ చాట్ పేరుతో మహిళా మంత్రుల గురించి చానా చులకనగా గా మాట్లాడారన్నారు. అదే విషయం మీడియా ముఖంగా చెప్పి ఉంటే మహిళలే బుద్ధి చెప్పేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bathukamma History: వెయ్యేళ్ల బతుకమ్మ చరిత్ర మీకు తెలుసా?



మహిళా మంత్రులను పదే పదె కించపరుస్తూ తన దొర దురంకారాన్ని కేటీఆర్ చాటుకుంటున్నారన్నారు. చాటుమాటుగా నాలుగు గోడల మధ్య మాట్లాడటం కాదని.. ధైర్యముంటే బహిరంగంగా మాట్లాడాలన్నారు. ‘‘నేనెప్పుడూ వ్యక్తిగతంగా ఎవరినీ దూషించలేదు.. దూషణలకు, భూతులకు బ్రాండ్ అంబాసిడరే మీరు. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించినట్లు ఆధారాలు చూపిస్తావా? రాజకీయాల్లో మేము ఉండకూడదన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా మాపై పదేపదే అభ్యంతరకర కామెంట్స్ చేయిస్తున్నారు. కనీసం సొంత సోషల్ మీడియాను కట్టడి చేయాలన్న సభ్యత కేటీఆర్‌కు లేదు. నువ్వు ఇలానే రెచ్చిపోతే రేపు మీ కుటుంబ సభ్యులు తలదించుకోవాల్సి వస్తుంది’’ అంటూ మంత్రి సీతక్క హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

Pawan Kalyan: శ్రీవారి పాదాల చెంత వారాహి డిక్లరేషన్ బుక్.. మీడియాకు ప్రత్యేకంగా చూపించిన పవన్

KTR: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ ఏమన్నారంటే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2024 | 04:07 PM