Share News

Pink Power Run: గచ్చిబౌలి స్టేడియంలో ‘పింక్ పవర్ రన్ 2024’

ABN , Publish Date - Sep 29 , 2024 | 07:26 AM

రోజు రోజుకీ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అధికం అవుతోంది. దీనికి కారణం క్యాన్సర్ పై అవగాహన లేకపోవడమే. క్యాన్సర్ ను మొదట్లోనే గుర్తించక పోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సుధా రెడ్డి, ఎంఈఐఎల్ ఫౌండేషన్ సంయుక్తంగా ‘పింక్ పవర్ రన్ 2024’ కార్యక్రమాన్ని నిర్వహించింది.

Pink Power Run: గచ్చిబౌలి స్టేడియంలో ‘పింక్ పవర్ రన్ 2024’

హైదరాబాద్: సుధారెడ్డి, ఎంఈఐఎల్ ఫౌండేషన్ (Sudha Reddy, MEIL Foundation) ఆధ్వర్యంలో ‘పింక్ పవర్ రన్ 2024’ (Pink Power Run 2024) కార్యక్రమం ఆదివారం ఉదయం 5.30 గంటలకు గచ్చిబౌలి స్టేడియంలో (Gachibowli Stadium) ప్రారంభం అయింది. బ్రెస్ట్ క్యాన్సర్‌పై (Breast cancer) అవగాహన పెంచడం కోసం పింక్ పవర్ రన్ కార్యక్రమాన్ని సుధా రెడ్డి, ఎంఈఐఎల్ ఫౌండేషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సుమారు 5 వేల మందికి పైగా ఈ పింక్ పవర్ రన్‌లో పాల్గొన్నారు. స్టూడెంట్స్, డాక్టర్స్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులతో సహా అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులు పాల్గొన్నారు. మూడు కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల పింక్ పవర్ రన్‌ను సుధా రెడ్డి, ఎంఈఐఎల్ ఫౌండేషన్ నిర్వహించింది. ప్రపంచ రికార్డ్ సృష్టించే విధంగా పింకు పవర్ రన్‌ను నిర్వహిస్తున్నారు.


రోజు రోజుకీ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అధికం అవుతోంది. దీనికి కారణం క్యాన్సర్ పై అవగాహన లేకపోవడమే. క్యాన్సర్ ను మొదట్లోనే గుర్తించక పోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సుధా రెడ్డి, ఎంఈఐఎల్ ఫౌండేషన్ సంయుక్తంగా ‘పింక్ పవర్ రన్ 2024’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాది మంది ఔత్సాహికులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రంగంలోకి సిట్..

జర జాగ్రత్త... రేవంత్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 29 , 2024 | 07:26 AM