Share News

Rains: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు..

ABN , Publish Date - May 16 , 2024 | 12:11 PM

హైదరాబాద్: రాష్ట్రంలో గురు, శుక్రవారాలు అక్కడక్కడ వర్షాలు కురుస్తామని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు అధికారులు అరెంజ్ అలర్టు జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మొస్తరు వర్షాలు కురిసే అవకావముందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

Rains: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు..

హైదరాబాద్: రాష్ట్రంలో గురు, శుక్రవారాలు అక్కడక్కడ వర్షాలు (Rains) కురుస్తామని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) తెలియజేసింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు అధికారులు అరెంజ్ అలర్టు (Orange alert) జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మొస్తరు వర్షాలు కురిసే అవకావముందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.


మరోవైపు భారత వాతావరణ శాఖ (Indian Meteorological Department) అన్నదాతకు చల్లని కబురు చెప్పింది. ఏ ఏడాది నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) మే 31న కేరళ తీరాన్ని (Kerala coast) తాకుతాయని ప్రకటించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్‌ 1 కేరళకు వస్తాయి. అయితే ఈ ఏడాది ఒకరోజు ముందుగా (నాలుగు రోజులు అటూ ఇటుగా) రానున్నాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్రా తెలిపారు. గతనెలలో ఇచ్చిన నివేదిక ప్రకారం నైరుతి సీజన్‌లో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 4 నెలల నైరుతి సీజన్‌లో జూన్‌, జూలై నెలలు అత్యంత కీలకం. ఈ నెలల్లోనే ఖరీఫ్‌ సాగు ఎక్కువగా సాగుతుంది. ఈ రెండు నెలల్లో వర్షాలు సంతృప్తికరంగా ఉంటాయని మహాపాత్రో వివరించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశంలో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని కేంద్రం ప్రకటించింది.


ఎండలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. దక్షిణ భారత దేశంలో గురువారం నుంచి ఆరు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణశాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కోట్ల ఆస్తికి వారసుడే అయినా..

ఆ ఇద్దరు మంత్రులకు దడ..!

మోసం చేసిన ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థి..!

నిద్రలోనే అగ్నికి ఆహుతి

రాష్ట్రంలో ఏం జరుగుతోంది?

దుమ్మురేపిన ఓటర్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 16 , 2024 | 12:18 PM