Hyderabad Sailing Week: హుస్సేన్ సాగర్‌లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు షురూ..
ABN , Publish Date - Jul 02 , 2024 | 04:00 PM
హుస్సేన్ సాగర్‌లో "హైదరాబాద్ సెయిలింగ్ వీక్"(Hyderabad Sailing Week) పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి(మంగళవారం) నుంచి ఈనెల 7వ తేదీ వరకు హుస్సేన్ సాగర్‌లో సందడి వాతావరణం నెలకొననుంది. ఇప్పటికే నీటి అలలపై తెరచాప పడవలతో క్రీడాకారులు ఔరా అనిపిస్తున్నారు. ఏడో తేదీ వరకు సందర్శకులకు ఈ పోటీలు కనువిందు చేయనున్నాయి.
హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో "హైదరాబాద్ సెయిలింగ్ వీక్"(Hyderabad Sailing Week) పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి(మంగళవారం) నుంచి ఈనెల 7వ తేదీ వరకు హుస్సేన్ సాగర్‌లో సందడి వాతావరణం నెలకొననుంది. ఇప్పటికే నీటి అలలపై తెరచాప పడవలతో క్రీడాకారులు ఔరా అనిపిస్తున్నారు. ఏడో తేదీ వరకు సందర్శకులకు ఈ పోటీలు కనువిందు చేయనున్నాయి. ఈ మెగా ఈవెంట్‌ను ఈఎమ్ఈ సెయిలింగ్ అసోసియేషన్(EME Sailing Association) డైరెక్టర్ జనరల్ జె.ఎస్.సిధాన(Director General J.S.Sidana) ప్రారంభించారు.
ఆప్టిమిస్ట్, లేసర్, ఒమెగా, పికో, లేసర్ స్టాండర్డ్ వంటి ఐదు రకాల ఒలంపిక్ కెటగిరీల్లో పోటీలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన 100మందికి పైగా క్రీడాకారులు బరిలోకి దిగారు. ఈ సెయిలింగ్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన ప్లేయర్లు.. ఒలంపిక్స్‌కు వెళ్లే అవకాశం ఉండడంతో పెద్దఎత్తున క్రీడాకారులు పోటీ పడుతున్నారు. హైదరాబాద్ నడిబొట్టున హుస్సేన్ సాగర్‌లో వందలాది పడవలు తెరచాపలతో కనువిందు చేస్తుండడంతో పోటీలు చూసేందుకు జనం బారులు తీరుతున్నారు.
ఇది కూడా చదవండి:
Minister Tummala: రైతు ఆత్మహత్యపై మంత్రి తుమ్మల ఆగ్రహం.. తక్షణమే విచారణ చేయాలంటూ ఆదేశం..