Share News

Drug Case: చందానగర్ డ్రగ్స్ కేసు.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి

ABN , Publish Date - Nov 01 , 2024 | 01:30 PM

Telangana: పక్కా సమాచారంతో నిన్న (గురువారం) చందానగర్‌లో ఓ ఇంటిపై దాడి చేసి పోలీసులకు భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో 18 లక్షల విలువ చేసే 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. అయితే కేసులో అసలు ట్విస్ట్‌ను బయటపెట్టారు పోలీసులు.

Drug Case: చందానగర్ డ్రగ్స్ కేసు..  ఆసక్తికర విషయాలు వెలుగులోకి
Chandanagar Drugs Case

హైదరాబాద్, నవంబర్ 1: చందానగర్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని డాక్టర్ పట్టించినట్లు విచారణలో బయటపడింది. నిందితుడు కృష్ణారాం రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకు వచ్చాడు. షెల్టర్ కోసం హైదరాబాద్‌లో తన స్నేహితుడు రూపారాంను ఆశ్రయించాడు. చందానగర్‌లోని గుల్ మహర్ పార్క్ కాలనీలోని ప్లాట్ నెంబర్ 56లో రూపారాం ఉంటున్నారు. నిన్న (గురువారం) రూపా రాం నివాసానికి వచ్చిన నిందితుడు... తాను అర్జెంటుగా ఆంధ్రప్రదేశ్ వెళ్లాలని స్నేహితుడికి చెప్పాడు.

KTR: కేటీఆర్ సంచలన నిర్ణయం.. తెలంగాణ వ్యాప్తంగా


అయితే కృష్ణారాంపై అనుమానం వ్యక్తం చేసిన అతని స్నేహితుడు.. నిందితుడు బాత్రూంకి వెళ్ళినప్పుడు అతని బ్యాగ్ తనిఖీ చేశారు. అందులో ఉన్నవి చూసి రూపారాం షాక్‌కు గురయ్యాడు. అతని బ్యాగులో డ్రగ్స్ కనిపించడంతో రూపారాం షాక్ తిన్నాడు. వెంటనే ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కృష్ణారాం తీసుకువచ్చిన 150 గ్రాముల డ్రగ్స్‌ను సీజ్ చేశారు. అలాగే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


కాగా.. పక్కా సమాచారంతో నిన్న చందానగర్‌లో ఓ ఇంటిపై దాడి చేసి పోలీసులకు భారీగా డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో 18 లక్షల విలువ చేసే 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు సమాచారం.


కేసుపై ఇన్‌స్పెక్టర్ పాలవెల్లి ఏమన్నారంటే

చందానగర్‌లో పట్టుబడిన డ్రగ్స్‌కు సంబంధించిన వివరాలను ఇన్‌స్పెక్టర్ పాలవెల్లి మీడియాకు తెలియజేశారు. ‘‘నిన్న సాయంత్రం చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్ మహల్ పార్క్ లోని ఓ ఇంట్లో డ్రగ్స్ ఉన్నట్లు టీఎన్‌ఎస్‌ఎన్‌ఏబీకు, మాకు సమాచారం వచ్చింది. ఆ ఇంట్లో 18 లక్షల రూపాయలు విలువచేసే 150 గ్రాముల డ్రగ్స్ గుర్తించాం. రాజస్థాన్ నుంచి నగరానికి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్న కృష్ణ రామ్ చౌదరి. గుల్ మోహర్ పార్క్‌లోని రమేష్ రూపారాం ఇంటికి నిందితుడు వచ్చాడు. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డ్రగ్స్‌ను తీసుకెళ్తున్నాడు. హడావిడిగా ఉన్న నిందితుడు కృష్ణ రాంచౌదరిపై అనుమానంతో బ్యాగ్‌ను రూపారాం తనిఖీ చేశారు. బ్యాగ్‌లో డ్రగ్స్ చూసి పోలీసులకు రూపారాం సమాచారం అందించారు. కృష్ణ రాం చౌదరిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్‌తో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశాం. ఇప్పటి వరకు ఈ కేసులో కృష్ణ రాం చౌదరికి సహకరిస్తున్న మొత్తం ఎనిమిది మందిని గుర్తించాం. ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు కృష్ణ రాం చౌదరిని అరెస్ట్ చేశాం. A7 చాయిల్ సింగ్, A8 సుమార్ సింగ్ ఇద్దరినీ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నాం’’ అని ఇన్‌స్పెక్టర్ తెలియజేశారు.


మరోవైపు హైదరాబాద్‌లో నిన్న రెండు చోట్ల అక్రమంగా విక్రయిస్తున్న యాష్ ఆయిల్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఓ మహిళతో పాటు ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సామ్రాట్ హోటల్ వద్ద ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడి చేశారు. మూడు లీటర్ల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఓటీ పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే రాజేంద్రనగర్‌లో బండ్లగూడలో 300 గ్రాముల యాష్ ఆయిల్‌ను నార్కోటిక్ బ్యూరో అధికారులు సీజ్ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా యాష్ ఆయిల్ విక్రయిస్తున్న లేడి కిలాడిని చాకచక్యంగా పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బండ్లగూడలో రహీమ్ ఉన్నీసా అనే లేడి ఇంట్లో సోదాలు చేశారు. చిన్న చిన్న బాటిల్స్‌లో యాష్ ఆయిల్‌ను నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించారు. విక్రయానికి సిద్ధంగా ఉన్న యాష్ ఆయిల్‌ను సీజ్ చేసి, లేడి కిలాడిని అరెస్ట్ చేశారు. ఎన్టీపీఎస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసి నార్కోటిక్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Multipurpose Park: కరీంనగర్ వాసులకు గుడ్ న్యూస్..

Harirama jogaiah: మరో లేఖతో ముందుకొచ్చిన హరిరామజోగయ్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 01 , 2024 | 02:34 PM