TS News: గడిచిన 10 ఏళ్లలో వేసవిలోనే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు
ABN , Publish Date - May 08 , 2024 | 10:42 AM
రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న మియాపూర్ లో అత్యధికంగా 13.5 సెంటి మీటర్ల వర్షంపాతం కురిసింది. గడిచిన 10 ఏళ్లలో వేసవిలోనే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఉదయం వేళల్లో పొడి వాతావరణం, సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
హైదరాబాద్: రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న మియాపూర్ లో అత్యధికంగా 13.5 సెంటి మీటర్ల వర్షంపాతం కురిసింది. గడిచిన 10 ఏళ్లలో వేసవిలోనే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గమనార్హం. ఉదయం వేళల్లో పొడి వాతావరణం, సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా.. నిన్న కురిసిన వర్షానికి సగం నగరం అంధకారంలో ఉండిపోయింది. పలు ప్రాంతాల్లో 7 నుంచి 8 గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫోన్లు స్విచాఫ్ కావడంతో పాటు ఇంటర్‌నెట్ వ్యవస్థ పని చేయకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో సంబంధాలు తెగిపోయాయి.
Ragidi Lakshmareddy: సార్ రావాలి.. కారు గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు..
నిన్న కురిసిన వర్షానికి బాచుపల్లిలో ఓ రిటైనింగ్ వాల్ కూలి ఏడుగురు కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే కూకట్‌పల్లి బాలాజీనగర్, కేపీహెచ్‌బీ కాలనీ, కుత్బుల్లాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి, ఎల్లారెడ్డి, యూసుఫ్‌గూడ గణపతి కాంప్లెక్స్, ఎస్‌ఆర్‌నగర్ బీకేగూడ, కొత్తపేట, న్యూ నాగోల్, బంజారాహిల్స్, అత్తాపూర్ ప్రాంతాల్లో గంటల కొద్దీ విద్యుత్‌సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులకు హైదర్‌గూడలో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. రోడ్ నంబర్ 12 బంజారాహిల్స్ సబ్‌స్టేషన్‌లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌పై చెట్టు విరిగిపడింది.
ఇదికూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. గోడకూలి ఏడుగురి మృతి.. జేసీబీలతో మృతదేహాలు వెలికితీత
Read Latest Telangana News and National News