Share News

Justice PC Ghose : నేటి నుంచి మళ్లీ కాళేశ్వరంపై విచారణ.. హాజరుకానున్న కీలక అధికారులు

ABN , Publish Date - Sep 20 , 2024 | 09:11 AM

జస్టిస్ పి.సి. ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ విచారణ శుక్రవారం నుంచి మళ్లీ తిరిగి ప్రారంభం కానుంది. దీంతో ఈ కమిషన్ ఎదుట విచారణకు ఈ రోజు ఏడుగురు చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులు హాజరు కానున్నారు. అలాగే వారితోపాటు రీసెర్చ్ ఇంజనీర్లతోపాటు అడ్మినిస్ట్రేటివ్ అధికారులు సైతం ఈ కమిషన్ ఎదుట విచారణను ఎదుర్కొనున్నారు.

Justice PC Ghose : నేటి నుంచి మళ్లీ కాళేశ్వరంపై విచారణ.. హాజరుకానున్న కీలక అధికారులు
Justice PC Ghose

హైదరాబాద్, సెప్టెంబర్ 20: జస్టిస్ పి.సి. ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ విచారణ శుక్రవారం నుంచి మళ్లీ తిరిగి ప్రారంభం కానుంది. దీంతో ఈ కమిషన్ ఎదుట విచారణకు ఈ రోజు ఏడుగురు చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులు హాజరు కానున్నారు. అలాగే రీసెర్చ్ ఇంజనీర్లతోపాటు అడ్మినిస్ట్రేటివ్ అధికారులు సైతం ఈ కమిషన్ ఎదుట నేడు విచారణను ఎదుర్కొనున్నారు.


ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఈ విచారణకు 25 అధికారులు హాజరుకానున్నారని తెలుస్తుంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నివేదిక సమర్పించాలని ఎన్‌డీఎస్ఏ‌కు కమిషన్ లేఖ రాసింది. అదే విధంగా జస్టిస్ పి.సి. ఘోష్ కమిషన్ అడిగిన లాయర్‌‌ను కేటాయించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సంసిద్ధత వ్యక్తం చేసింది.


అయితే ఈ విచారణలో భాగంగా హాజరవుతున్న ప్రతి ఒక్కరి నుంచి అఫిడవిట్ రూపంలో కమిషన్ వివరాలు తీసుకుంటుంది. ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి 15 మందికిపైగా అధికారులను ఈ కమిషన్ విచారించింది. ఈ సందర్భంగా వారి స్టేట్‌మెంట్‌లను జస్టిస్ చంద్ర ఘోష్ కమిషన్ రికార్డు చేసింది.


బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించారు. అయితే గతేడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ప్రాజెక్ట్‌లోని కొన్ని పిల్లర్లు కుంగాయి. దీంతో వేల కోట్ల రూపాయిలతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ నాణ్యతపై నీలి నీడలు కమ్ముకున్నాయి. దాంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి.


ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు రానే వచ్చాయి. తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరింది. నాటి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌‌పై విచారణ జరపాలని రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.


ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.సి.ఘోష్ నేతృత్వంలో కమిషన్ విచారణ జరుపుతుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ క్రమంలో ఈ ప్రాజెక్ట్‌పై జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. అయితే ఇప్పటికే ఈ కమిషన్ కాల పరిమితి ముగిసింది. దీంతో ఈ కమిషన్ గడువు పెంచుతూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విధితమే.

For Telangana News And Telugu News...

Updated Date - Sep 20 , 2024 | 09:15 AM