త్వరలో రామగుండం సోలార్ విద్యుత్ ప్లాంట్ విస్తరణ
ABN , Publish Date - Mar 05 , 2024 | 11:49 PM
రామగుండంలో త్వరలో సోలార్ విద్యుత్‌ను విస్తరిస్తామని, కొత్తగా 176 మెగా వాట్ల ప్రాజెక్టు నెలకొల్పుతామని రామగుండం ఎన్టీపీ సీ, టీఎస్‌టీపీపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండు తెలిపారు.

జ్యోతినగర్, మార్చి 5 : రామగుండంలో త్వరలో సోలార్ విద్యుత్‌ను విస్తరిస్తామని, కొత్తగా 176 మెగా వాట్ల ప్రాజెక్టు నెలకొల్పుతామని రామగుండం ఎన్టీపీ సీ, టీఎస్‌టీపీపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండు తెలిపారు. మంగళవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఈడీ కేదార్ రంజన్ మాట్లాడారు. ఇప్పటికే ఎన్టీపీసీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో దేశంలోనే అతి పెద్ద 100 మెగావాట్ల ఫ్లోటింగ్(నీటిలో తేలియాడే) సోలార్ ప్రాజెక్టును నిర్మించామన్నారు. మరో 10 మెగా వాట్ల సోలార్ ప్రాజెక్టు గత పదేళ్లుగా నడుస్తున్నదన్నా రు. విస్తరణలో భాగంగా ఎన్టీపీసీ రిజర్వాయర్‌లోనే 56 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ యూనిట్, సంస్థ పరిధిలో ని స్థలంలో 120 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతామన్నారు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలో నిర్మాణ పనులు మొదలుపెడుతామన్నారు.
తెలంగాణ ఎన్టీపీసీ స్టేజ్-2 నిర్మాణానికి సిద్ధం
తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు దెండో దశ(స్టేజ్ 2) నిర్మించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం(పీపీఏ) కుదిరిన తరువాత 2400 మెగావాట్ల(800 మెగావాట్ల 3 యూనిట్లు) స్టేజ్ 2 నిర్మాణ పనులు చేపడుతామని తెలిపారు. స్టేజ్ 2 విషయంలో సాంకేతిక పరమైన పనులు జరుగుతున్నాయని, పీపీఏ పూర్తయితే నిర్మాణానికి సంబం ధించి ముందడుగు పడుతుందన్నారు. టీఎస్‌టీపీపీ స్టేజ్-1లో 800 మెగావాట్ల రెండు యూనిట్లు ప్రారంభమయ్యాయని, కమర్షియల్ ఆపరేషన్ డిక్లేర్(సీవోడీ) ప్రకటించామన్నారు. మొదటి యూనిట్‌ను గత ఏడాది అక్టోబరు 3న, 2వ యూనిట్‌ను గత సోమవారం ప్రధా ని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారన్నారు. టీఎస్‌టీపీపీ స్టేజ్- 1 పూర్తవడతో ప్రస్తుతం రామగుండం ఎన్టీపీసీ స్థాపిత సామర్థ్యం 4200 మెగావాట్లకు(రామగుండం 2600 మెగావాట్లు, టీఎస్‌టీపీపీ 1600 మెగావాట్లు) చేరిందని, దీంతో దేశంలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా గుర్తింపు వచ్చిందన్నారు. తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టుతో రాష్ట్ర విద్యుత్ అవసరాలు గణనీయంగా తీరుతాయని, ఈ ప్రాజెక్టు నుంచి 85 శాతం విద్యుత్ తెలంగాణాకే సరఫరా చేస్తామన్నారు. టీఎస్‌టీపీపీని ఆధునిక సూపర్ క్రిటికల్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించామన్నారు. కాలుష్య నియంత్రణకు సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, అలాగే 2600 మెగావాట్ల రామగుం డం ఎన్టీపీసీలో ఎఫ్‌జీడీ నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయన్నారు.
సామాజిక అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులు..
ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులను ఖర్చుచేస్తున్నామని ఈడీ తెలిపారు. మౌళిక వసతులు, విద్య, ఉపాఽ ది, తదితర రంగాల్లో సీఎస్‌ఆర్ నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. కాగా, 2600 మెగావాట్ల రామగుండం ఉత్పత్తిని ప్రారంభించి 40 ఏళ్లు దాటిందన్నారు. నాలుగు దశాబ్ధాలుగా దక్షిణాది రాష్ట్రాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోందన్నారు. ప్రాజెక్టుకు ఇటీవల గోల్డె న్ పీకాక్ అవార్డు(2023), ఎక్స్‌లెంట్ ఎనర్జీ యూనిట్‌గా సీఐఐ జా తీయ అవార్డు, బెస్ట్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ అవార్డులు లభిం చాయన్నారు. విలేకరుల సమావేశంలో జీఎంలు, ఏజీఎం(హెచ్‌ఆర్) విజయ్‌కుమార్ సిక్దర్, డీజీఎం ప్రశాంత్ శ్యామ్యూల్, పీఆర్‌వో రూపాలి రంజన్ పాల్గొన్నారు.