కాలువలను పరిరక్షించుకోవడం అందరి బాధ్యత
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:04 AM
సాగునీటి కాలువలను పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని, ఎస్సారెస్పీ కాలువలను ధ్వంసం చేస్తే ఎవరినీ ఉపేక్షిం చేది లేదని ఎమ్మెల్యే విజయరమణారావు హెచ్చరిం చారు. సుల్తానాబాద్ సహకార సంఘం సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది.

సుల్తానాబాద్, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): సాగునీటి కాలువలను పరిరక్షించుకోవడం అందరి బాధ్యత అని, ఎస్సారెస్పీ కాలువలను ధ్వంసం చేస్తే ఎవరినీ ఉపేక్షిం చేది లేదని ఎమ్మెల్యే విజయరమణారావు హెచ్చరిం చారు. సుల్తానాబాద్ సహకార సంఘం సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజ రైన ఎమ్మెల్యే మాట్లాడుతు కాలువల చివరి భూము లకు నీరందకుండా మొదట్లోనే కొందరు రైతులు నీటి చౌర్యానికి పాల్పడుతున్నారని, ఈ విషయంలో ఎవరినీ వదిలేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కోట్లాది రూపా యలతో రోడ్లు నిర్మిస్తే కొందరు కేజ్‌వీల్స్ ట్రాక్టర్లు నడపడంతో దెబ్బతింటున్నాయని, వీరిని కూడా ఉపే క్షించేది లేదని, మొదటి సారి రెండు వేలు, రెండో సారి ఐదు వేలు జరిమానా విధించేలా చర్యలు తీసు కుంటామని మూడోసారి అలాగే వస్తే వాహనాలు సీజ్ చేస్తామన్నారు. రోడ్లను కాపాడుకోవడానికి త్వర లోనే పలు శాఖల అధికారులతో సమన్వయ సమావే శాన్ని ఏర్పాటుచేసి ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోళ్లు
ఎలాంటి కటింగ్‌లు లేకుండా నియోజకవర్గంలో మాత్రమే ధాన్యం కొనుగోళ్ళు జరుగుతుందని ఎమ్మె ల్యే అన్నారు. సన్న వడ్లు పండించినా వారం దరికీ క్వింటాల్‌కు ఐదు వందలు చొప్పున బోనస్ ఇప్పిస్తామన్నారు. ఎనభై శాతం మందికి రుణమాఫీ జరిగినా బీఆర్‌ఎస్, బీజేపీలు తమ పై బురద జల్లడం, ప్రజ లను మభ్యపెట్టడం మానడం లేదని, ఎక్కడ చర్చ కైనా తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, కేడీసీసీబి డైరక్టర్, సహకార సంఘం చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీమాల మాట్లాడారు. సంఘం సీఈఓ బూరుగు సంతోష్ మా ట్లాడుతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్దిని ఆదాయ వ్యయాలను వివరించారు. సంఘ డైరక్టర్లు పన్నాల రాములు తదితరులు పాల్గొన్నారు.