Share News

Jagitial: గంగారెడ్డి హత్య కేసు.. పోలీసులతో నిందితుడికి సంబంధాలపై విచారణ

ABN , Publish Date - Oct 23 , 2024 | 07:53 AM

జగిత్యాల: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి (58) దారుణ హత్య కేసులో పోలీసులు నిందితుడి నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పోలీసులతో నిందితుడికి ఉన్న సంబంధాలపై విచారణ జరుగుతోంది. నిన్న (మంగళవారం) పోలీసుల వైఫల్యంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ ఆరోపణలు చేశారు.

 Jagitial: గంగారెడ్డి హత్య కేసు.. పోలీసులతో నిందితుడికి సంబంధాలపై విచారణ

జగిత్యాల: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి (Congress MLC Jeevan Reddy) ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి (58) (Maru Ganga Reddy) దారుణ హత్య కేసు (Murder Case)లో పోలీసులు (Police) నిందితుడి నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కాల్ డేటా, వాట్సాప్ డేటా పరిశీలిస్తున్నారు. కాగా పోలీసులతో నిందితుడికి ఉన్న సంబంధాలపై విచారణ జరుగుతోంది. నిన్న (మంగళవారం) పోలీసుల వైఫల్యంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ ఆరోపణలు చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడు రీల్స్ చేసినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే రీల్స్ చేసిన విషయం తన దృష్టికి రాలేదని డీఎస్సీ రఘు చందర్ చెప్పారు. కాగా ఈ ఘటనపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్‌గా ఉంది.

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి (58) దారుణ హత్యకు గురయ్యారు. జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల రూరల్‌ మండలం జాబితాపూర్‌ గ్రామంలో ఈ దారుణం జరిగింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ ఎంపీటీసీ అయిన గంగారెడ్డి.. నాలుగు దశాబ్దాలుగా జీవన్‌ రెడ్డికి రాజకీయంగా అనుచరుడిగా కొనసాగుతున్నారు. మంగళవారం ఉదయం తన సొంత గ్రామమైన జాబితాపూర్‌లో ద్విచక్ర వాహనంపై వెళుతున్న గంగారెడ్డిని అదే గ్రామానికి చెందిన బత్తిని సంతోష్‌ గౌడ్‌ అనే యువకుడు కారుతో వెనుకనుంచి ఢీ కొట్టాడు. అదుపు తప్పి కిందపడిన గంగారెడ్డిని అందరూ చూస్తుండగానే కత్తితో ఛాతీతో పాటు కడుపులో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం నిందితుడు సంతోష్‌ గౌడ్‌ తన చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను కొద్ది దూరంలో పడేసి వేరే కారులో అనుచరులతో కలిసి పారిపోయాడు.


తీవ్రంగా గాయపడిన గంగారెడ్డిని కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుని గంగారెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం జగిత్యాల-ధర్మపురి ప్రధాన రహదారి ఇందిరా చౌక్‌ వద్ద కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ సైతం ధర్నాలో పాల్గొని పోలీసుల తీరుపై మండిపడ్డారు. అక్కడికి చేరుకున్న ఎస్పీ అశోక్‌ వారితో మాట్లాడారు. కాగా, జాబితాపూర్‌ గ్రామానికే చెందిన నిందితుడు సంతోష్‌ గౌడ్‌, గంగారెడ్డిల మధ్య వ్యక్తిగతంగా విభేదాలున్నట్లు సమాచారం. గతంలో బీఆర్‌ఎ్‌సలో ఉన్న సంతోష్‌ గౌడ్‌ తర్వాత కాంగ్రె్‌సలో చేరాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

4 నెలలుగా అవమానాలు ఎదుర్కొంటున్నా: జీవన్‌ రెడ్డి

కాంగ్రెస్‌ నాయకుడి హత్య విషయాన్ని తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌.. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఈ సమయంలో జీవన్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌తో అసహనంగా మాట్లాడారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితానికి కాంగ్రెస్‌ మంచి బహుమతి ఇచ్చిందని వ్యాఖ్యానించారు. పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని, ఇంతకాలం మానసికంగా అవమానాలకు గురైనా భరించానని, ఇప్పుడు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆయనతో పేర్కొన్నారు. దయచేసి నన్ను క్షమించండి అన్నా అంటూ ఫోన్‌కాల్‌ కట్‌ చేశారు. అంతకుముందు విప్‌ లక్ష్మణ్‌ కుమార్‌తో జీవన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘మీ పార్టీకి.. మీకు ఓ దండం.. మీ పార్టీలో నేను ఇక ఉండను.. ఇక నైనా బతక నివ్వండి’ అంటూ వ్యాఖ్యానించారు.


ఈ సందర్భంగా విలేకరులతో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని సంతోషపడాలా, అను చరుడు హత్యకు గురైనందుకు బాధపడాలా అర్థంకావడం లేదన్నారు. నియోజకవర్గంలో కొందరు నేతలు కాంగ్రెస్‌ ముసుగులో దాడులకు పాల్పడుతున్నారని, బీఆర్‌ఎస్‌ అరాచకాలు సృష్టిస్తోందని ఆరోపించారు. నాలుగు నెలలుగా నియోజకవర్గంలో రాజకీయంగా అవ మానాలు ఎదుర్కొంటున్నానని, కానీ ప్రస్తుతం భౌతికదాడులకు దిగడంతో కాంగ్రె్‌సలోనే కాదు.. రాజకీయ జీవితంలోనూ కొనసాగడం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కాగా, హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌.. గంగారెడ్డి హత్యను తీవ్రంగా ఖండించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ నేడు..

ఏపీని ఆపలేరు!

బొత్సకు జీ హుజూర్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 23 , 2024 | 07:54 AM