Kishan Reddy: 3 నెలలైనా ఉంటా..
ABN , Publish Date - Nov 17 , 2024 | 04:11 AM
’’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టును విమర్శించే నేతలు దమ్ముంటే ఒక రోజు పరీవాహక బస్తీలో ఉండాలని.. అలా చేయగలిగితే తాను ప్రాజెక్టును విరమించుకుంటానని ’’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
బస్తీకే నివాసాన్ని మార్చుకుంటా.. పేదల ఇళ్లను కూల్చనివ్వం.. సుందరీకరణ పేరిట రియల్ వ్యాపారం
సీఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం.. మూసీ పరీవాహకంలో బీజేపీ నాయకుల బస్తీ నిద్ర
హైదరాబాద్ సిటీ/గోల్నాక/చాదర్‌ఘాట్/దిల్‌సుఖ్‌నగర్, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): ’’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టును విమర్శించే నేతలు దమ్ముంటే ఒక రోజు పరీవాహక బస్తీలో ఉండాలని.. అలా చేయగలిగితే తాను ప్రాజెక్టును విరమించుకుంటానని ’’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టును విమర్శించే నేతలు దమ్ముంటే ఒక రోజు పరీవాహక బస్తీలో ఉండాలని.. అలా చేయగలిగితే తాను ప్రాజెక్టును విరమించుకుంటానని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మూసీ పరీవాక ప్రాంతాల్లో బీజేపీ నేతలు శనివారం రాత్రి బస్తీ నిద్ర చేశారు. గోల్నాక డివిజన్‌లోని తులసీరాంనగర్(లంక) బస్తీలో కిషన్‌రెడ్డి, మూసారంబాగ్‌లో ఎంపీ లక్ష్మణ్, చైతన్యపురిలో ఎంపీ ఈటల రాజేందర్ బస చేశారు. తులసీరాంనగర్ బస్తీలో శనివారం సాయంత్రం కిషన్‌రెడ్డి పర్యటించారు. రచ్చబండ నిర్వహించి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడారు.
మూసీ సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రకటనలతో ప్రజలు భయపడుతున్నారని, ఎప్పుడు బుల్డోజర్ వచ్చి వారి ఇళ్లను కూలగొడుతుందోనని భయాందోళనలో ఉన్నారని చెప్పారు. పేద ప్రజలు కష్టపడి ఇళ్లు కట్టుకుని 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నారని, ప్రభుత్వం వారి ఇళ్లను కూల్చి వేస్తామంటే తాము అడ్డుకుంటామని తెలిపారు. ‘‘మూసీ సుందరీకరణ ఉద్దేశ్యం ఏమిటి..? ప్రాజెక్టు ఎలా ఉండబోతోంది..? నిధులు ఎక్కడ నుండి తీసుకొస్తున్నారు..? పేదల ఇళ్లను కూల్చి రూ.లక్షా యాభై వేల కోట్లతో సుందరీకరణ అవసరమా..?’’ అని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్, విధివిధానాలు లేవని.. అలాంటప్పడు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయడం లేదనడం సరికాదని అన్నారు. మూసీ పునరుద్ధరణకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. నదిని ప్రస్తుతం ఉన్న విధంగానే ఉంచి.. రిటైనింగ్ గోడలు కట్టి పనులు చేసుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు.
ఎన్ని బుల్డోజర్లు పంపుతావో పంపు: లక్ష్మణ్
‘రేవంత్.. మూసీ సుందరీకరణ పేరుతో నిరుపేదల ఇళ్లను కూల్చేందుకు ఎన్ని బుల్డోజర్లు పంపుతావో పంపు. వాటికి అడ్డుగా నిలిచి అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉంటాం’ అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మూసీ నిద్రలో భాగంగా మూసారంబాగ్ శాలివాహననగర్‌లో శనివారం రాత్రి ఆయన బస చేశారు. అంతకుముందు స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడొద్దని.. బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బస్తీ వాసులతో కలిసి లక్ష్మణ్ రాత్రి భోజనం చేశారు. మూసీ సుందరీకరణకు సంబంధించి ఇప్పటి వరకు డీపీఆర్ సిద్ధం కాలేదని.. అలాంటప్పుడు ఏ ఽధైర్యంతో ఇళ్లను కూల్చివేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నిలదీశారు. చైతన్యపురి డివిజన్‌లోని ఫణిగిరి కాలనీలో ఆయన బస చేశారు. ఫణిగిరి కాలనీ, మారుతినగర్ ఫేజ్-1, ఫేజ్-2లను సందర్శించారు. రేవంత్ తుగ్లక్ పాలనతో మూసీ పరీవాహక ప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడని మండిపడ్డారు. గోల్నాక డివిజన్‌లోని కమలానగర్‌లో మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, అంబేద్కర్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే రత్నం, శాస్త్రీనగర్‌లో మాజీ మంత్రి కృష్ణ యాదవ్ బస్తీ నిద్ర చేశారు.