KTR: విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్న సర్కార్
ABN , Publish Date - Oct 16 , 2024 | 04:16 AM
‘‘పేద, మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసేలా రేవంత్ సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టిస్తోంది. ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రైవేటులో చదువుతున్న వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయడంలేదు’’ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వే
గురుకులాల అద్దె చెల్లించరా?: కేటీఆర్
హైదరాబాద్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ‘‘పేద, మధ్యతరగతి విద్యార్థులను విద్యకు దూరం చేసేలా రేవంత్ సర్కారు నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర విద్యారంగాన్ని పూర్తిగా భ్రష్టుపట్టిస్తోంది. ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రైవేటులో చదువుతున్న వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయడంలేదు’’ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. వేలమంది విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయి విద్యను అందించిన గురుకులాలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. గురుకుల భవనాలకు కనీసం అద్దె చెల్లించకపోవడంతో యాజమానులు తాళాలు వేసే దుస్థితి తెచ్చారన్నారని విమర్శించారు. మూసీ సుందరీకరణ కోసం రూ.1.50లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం వద్ద పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువుకోసం డబ్బుల్లేవా? అని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షి్‌పలు వెంటనే చెల్లించాలని, రెండు, మూడురోజుల్లో సమస్య పరిష్కరించకుంటే విద్యార్థులతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు.